ఢిల్లీ సబోర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) పలు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బి, గ్రూప్-సి కేటగిరీలకు చెందిన 1,979 పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 16 నుంచి జూలై 15 లోపు అప్లై చేసుకోవచ్చు.పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 16 మధ్యాహ్నం 12:00 గంటల నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: జూలై 15 రాత్రి 11:59 గంటల వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఖాళీల వివరాలు, పోస్టులు:
మొత్తం 25 రకాల పోస్ట్ కోడ్‌ల పరిధిలో 1,979 వేకెన్సీలు ఉన్నాయి.
TGT (కంప్యూటర్ సైన్స్): 675 పోస్టులు
స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ): 450 పోస్టులు
TGT (స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్): 163 పోస్టులు
ఐటీ అసిస్టెంట్ గ్రేడ్-A: 125 పోస్టులు
జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (సైబర్ ఫోరెన్సిక్): 81 పోస్టులు
వీటన్నిటితో పాటు లిఫ్ట్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ ఓవర్‌సీర్ వంటి పోస్టులు కూడా ఉన్నాయి.
కేటగిరీ వారిగా ఖాళీలు:
ఓపెన్ కేటగిరీ (UR): 997, OBC: 328, SC: 278, ST: 126, EWS: 250.
అర్హతలు:
పోస్టును బట్టి అర్హతలు వేర్వేరుగా ఉన్నాయి. కంప్యూటర్ టీచర్ పోస్టులకు బీసీఏ/బీటెక్ (CS/IT) లేదా డిగ్రీతో పాటు ‘A’ లెవెల్ కోర్స్ చదివి ఉండాలి. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఐటీ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పాసై, టైపింగ్ స్పీడ్ ఉండాలి.
వయోపరిమితి:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల పాటు వయోసడలింపు లభిస్తుంది.ఎక్స్-సర్వీస్‌మెన్, స్పోర్ట్స్ పర్సన్స్, విడాకులు తీసుకున్న మహిళలకు కూడా నిబంధనల ప్రకారం వయస్సులో మినహాయింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు,ఎక్స్-సర్వీస్‌మెన్ కేటగిరీల వారికి ఎలాంటి ఫీజు లేదు, వీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఫీజును కేవలం ‘SBI ePay’ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో పే చేయాలి.
సెలెక్షన్ ప్రాసెస్ :
ఉద్యోగాల ఎంపిక పూర్తిగా 200 మార్కుల కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) ద్వారా జరుగుతుంది. పోస్టును బట్టి పరీక్ష విధానం మారుతుంది. జనరల్ పోస్టులకు కేవలం జనరల్ సబ్జెక్టులు (రీజనింగ్, అర్థమెటిక్, జీకే, ఇంగ్లీష్, హిందీ) ఉంటాయి.
టెక్నికల్, టీచింగ్ పోస్టులకు జనరల్ సబ్జెక్టులతో పాటు (100 మార్కులు), వారి సొంత సబ్జెక్ట్/టీచింగ్ మెథడాలజీపై (100 మార్కులు) పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో క్వాలిఫై అవ్వడానికి జనరల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40%, ఢిల్లీ ఓబీసీ అభ్యర్థులకు 35%, SC/ST/PwBD అభ్యర్థులకు కనీసం 30% మార్కులు రావడం తప్పనిసరి.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ dsssbonline.nic.in ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.





