HomeJOBSనిరుద్యోగులకు గుడ్ న్యూస్..1,979 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్..1,979 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఢిల్లీ సబోర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB).. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1,979 అసిస్టెంట్, టీచర్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్,ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 16 జూన్ నుంచి 15 జులై వరకు dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి విద్యార్హతలను నిర్ణయించారు. నియామకాలు 200 మార్కుల కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా జరుగుతాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు జూన్ 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 15 జూలై (రాత్రి 11:59 గంటల వరకు).

ఖాళీల వివరాలు:
ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో టీజీటీ (కంప్యూటర్ సైన్స్) – 675 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేటర్ (ప్రైమరీ) 450 పోస్టులు ఉన్నాయి. అలాగే ఎఫ్ఎస్‌ఎల్‌లో జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ (JSA)పోస్టులు, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్-A(125 పోస్టులు), ఫిట్టర్, లిఫ్ట్ ఆపరేటర్ వంటి సాంకేతిక పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతలు:
ఐటీ అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్ పాస్‌తో పాటు టైపింగ్ స్పీడ్ ఉండాలి. టీచింగ్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, B.Ed,CTETఅర్హత అవసరం. సైంటిఫిక్ పోస్టులకు సంబంధిత సైన్స్ సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈ,బీటెక్ అర్హత కలిగి ఉండాలి.

జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ. 19,900 నుంచి రూ. 1,42,400 వరకు (పే లెవెల్ 2 నుంచి లెవెల్ 7) జీతం లభిస్తుంది.

వయోపరిమితి:
సైంటిఫిక్, ఐటీ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, టీచింగ్ పోస్టులకు గరిష్టంగా 30 ఏళ్లు, ఇతర సాంకేతిక పోస్టులకు 32 నుంచి 37 ఏళ్ల లోపు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం:
అభ్యర్థులను వన్ టైర్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇందులో.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ కేటగిరీకి కనీస అర్హత మార్కులు 40% గా నిర్ణయించారు.

అప్లికేషన్ ప్రక్రియ:
ఆసక్తి గల అభ్యర్థులు dsssbonline.nic.in పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here