HomeJOBSటెన్త్ అర్హతతో 714 ఉద్యోగాలు.. పూర్తి వివరాలిగో

టెన్త్ అర్హతతో 714 ఉద్యోగాలు.. పూర్తి వివరాలిగో

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB).. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. డిసెంబర్ 17 నుంచి అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 15 వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:

సంస్థ పేరు- ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB)
పోస్ట్ పేరు- మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)
మొత్తం ఖాళీల సంఖ్య- 714
విభాగాల వారిగా పోస్టులు:
మల్టీ-టాస్కింగ్ స్టాప్ లేబర్ డిపార్ట్‌మెంట్- 93
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్‌మెంట్- 98
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్- 99
డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్- 123
డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్- 06
రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీస్- 23
ఫుడ్, సప్లైస్ & కన్స్యూమర్ అఫైర్స్-140

విద్యార్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ/సంస్థ నుంచి తప్పనిసరిగా టెన్త్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు : అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. (ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ. ఇతర ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి)

జీతం: అభ్యర్థులకు రూ. 18,000 – 56,900 (పే లెవల్-1 ప్రకారం) జీతం లభిస్తుంది.

అప్లికేషన్ ప్రారంభ తేదీ: అభ్యర్థులు డిసెంబర్ 12 నుంచి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: జనవరి 15,2026 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజుగా అభ్యర్థులు రూ. 100 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, SC, ST, PwBD, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

అప్లికేషన్ విధానం:
అధికారిక వెబ్ సైట్ https://dsssb.delhi.gov.in/ ద్వారా మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here