ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 714 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగి ఉన్న వారు జనవరి 15 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు: 714
సంస్థ పేరు: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB)
పోస్ట్ పేరు: మల్టీ-టాస్కింగ్ స్టాఫ్
విభాగాల వారీగా ఖాళీలు:
మొత్తం 12 వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం: 199
ఆహార, పౌర సరఫరాల శాఖ: 140
పట్టణాభివృద్ధి శాఖ: 109
కార్మిక శాఖ: 93
NCC విభాగం: 68 పోస్టులతో పాటు ఇతర పోస్టులు..
అర్హత: టెన్త్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి పని అనుభవం అవసరం లేదు.
వయస్సు(15/01/2026 నాటికి): 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.
ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, వికలాంగులు (PwBD)..మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులు రూ.18 నుంచి రూ. 56,900 వేలకు మధ్య జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: సాధారణ/ఓబీసీ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. మహిళలు,ఎస్టీ,ఎస్సీ, పీడబ్ల్యూడీ, మాజీ సైనికులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఫీజును కేవలం SBI e-pay ద్వారా మాత్రమే ఆన్ లైన్‌లో చెల్లించాలి.
అప్లికేషన్ చివరి తేదీ: జనవరి 15 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు ఫోటో, సంతకం, విద్యార్హులకు సంబంధించిన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు https://dsssbonline.nic.in వెబ్‌సైట్ ద్వారా ఆన్ లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి.





