కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అదిరి పోయే గుడ్ న్యూస్ అందించింది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల్లో ఖాళీగా ఉన్న మొత్తం 641 ప్యూన్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ , ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 4 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
ఢిల్లీ డిస్ట్రిక్ట్ కోర్టులు, ఫ్యామిలీ కోర్టుల పరిధిలో మొత్తం 641 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ & పర్సనల్ అసిస్టెంట్: 233 పోస్టులు
జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్ & ప్రాసెస్ సర్వర్: 174 పోస్టులు
ప్యూన్, ఆర్డర్లీ, డాక్ ప్యూన్: మిగిలిన ఇతర కేటగిరీ పోస్టులతో కలిపి మొత్తం 641 ఖాళీలు ఉన్నాయి.
విద్యార్హతలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు పోస్టును బట్టి నిర్దిష్ట విద్యార్హతలు కలిగి ఉండాలి.
ప్యూన్ / ఆర్డర్లీ / డాక్ ప్యూన్: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ పాస్ అయి ఉండాలి.
ప్రాసెస్ సర్వర్: టెన్త్ పాటు వ్యాలిడ్ ఎల్‌ఎమ్‌వి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ & జూనియర్ జ్యుడీషియల్ అసిస్టెంట్: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. షార్ట్‌హ్యాండ్, టైపింగ్ నైపుణ్యాలు అవసరం.
వయోపరిమితి: అన్ని పోస్టులకు సాధారణంగా అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులు కేవలం రూ.100 మాత్రమే అప్లై ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికోద్యోగులకు ఈ ఫీజు పూర్తిగా మినహాయింపు ఉంటుంది. ఫీజును కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 6 మధ్యాహ్నం 12 గంటల నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
చివరి తేదీ: నవంబర్ 4వ తేదీ రాత్రి 11 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు రాత పరీక్ష,డిస్క్రిప్టివ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి పరీక్షా విధానం మారుతుంది.
ఆసక్తి ,అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ dsssbonline.nic.in ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి.





