జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి అక్టోబర్1 నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మొదలైంది. 5వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి ప్రకటించారు. ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలు.. రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా విద్యాశాఖ ఇప్పటికే సమాచారం చేరవేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాలు డీఈఓ వెబ్‌సైట్లలోనూ అందుబాటులో ఉంచారు.
తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్
అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, టెట్, డీఎస్సీ, కుల ధ్రువీకరణ పత్రం, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్ (ఒరిజినల్)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకు వెళ్లాలి. పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్లో ఉంచిన ఫారాన్ని భర్తీ చేసి ప్రింటెడ్ కాపీ వెంట తీసుకెళ్లాలి.