హైదరాబాద్‌లోని డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DRDO DREL).. గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 46 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీకాం, బీటెక్/బీఈ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. డిసెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించే.. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలు:
సంస్థ పేరు- డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (DLRL),DRDO.
మొత్తం పోస్టులు- 46.
పోస్టు పేరు- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్.
అధికారిక వెబ్‌సైట్: drdo.gov.in.
అర్హతలు:
గ్రాడ్యుయేట్ (టెక్నికల్): అభ్యర్థులు సంబంధిత విభాగాలలో (ఈసీఈ,ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, CSE/IT/AI-ML, మెకానికల్, ఎలక్ట్రికల్) బీఈ/బీటెక్ అర్హత కలిగి ఉండాలి.
గమనిక: అభ్యర్థులు 2023, 2024, 2025 సంవత్సరాలలో ఉత్తీర్ణులై ఉండాలి.
టెక్నీషియన్ పోస్టులు: అభ్యర్థులు సంబంధిత విభాగాలలో (ECE,CSE,సివిల్) డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
గ్రాడ్యుయేట్ (నాన్-టెక్నికల్) పోస్టులు: అభ్యర్థులు బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసి ఉండాలి.
స్టైపెండ్: అభ్యర్థులకు నెలకు రూ. 10,900 నుంచి రూ. 12,300 చెల్లిస్తారు.
అప్లికేషన్ విధానం: అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in ద్వారా అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూ తేదీలు :
వాక్-ఇన్ ఇంటర్వ్యూలు.. డిసెంబర్ 22,23 తేదీల్లో 09:30 గంటల నుంచి 11:00 గంటల వరకు.. DRDO DLRL చంద్రాయణగుట్ట, హైదరాబాద్ లో జరుగుతాయి.





