డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM) నుంచి కీలక నియామక ప్రకటన వెలువడింది. దేశ రక్షణ రంగంలో తమ ప్రతిభను చాటాలనుకునే అభ్యర్థుల కోసం 764 ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలు రెండు ప్రధాన కేటగిరీలలో ఉన్నాయి. 1. సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B) కాగా 2. టెక్నీషియన్-ఏ (Tech-A). 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. విద్యార్హతకు సంబంధించిన వివరాలను త్వరలోనే పూర్తి నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు.
ముఖ్య వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 764
పోస్టుల వివరాలు:
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B): 561 పోస్టులు
టెక్నీషియన్-ఏ (Tech-A): 203 పోస్టులు
వయస్సు:
అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు కాగా.. గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల (SC/ST/OBC/EWS) అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు గరిష్ట వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
జీతం:
డీఆర్‌డీఓ-సీఈపీటీఏఎం రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జీతం లభిస్తుంది.
1.సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B)పోస్టులకు జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.
2. టెక్నీషియన్-ఏ (Tech-A) పోస్టులకు జీతం నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ల ప్రారంభ తేదీ: డిసెంబర్ 9 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
గమనిక: విద్యార్హతలు, ఎంపిక విధానం (ట్రైనింగ్, పరీక్షలు), అప్లికేషన్ ఫీజు, చివరి తేదీతో పాటు ఇతర పూర్తి సమాచారంతో పూర్తి నోటిఫికేషన్ DRDO అధికారిక వెబ్‌సైట్‌లో త్వరలో విడుదల కానుంది. ఇందుకోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.





