దేశ రక్షణ రంగానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ అయిన డీఆర్డీఓ (DRDO) పరిధిలోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), హైదరాబాద్‌లో వివిధ ట్రేడ్లలో అప్రెంటిస్ శిక్షణ కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలో అప్రెంటిస్ పూర్తి చేయాలని ఆశపడే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 195 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ లోపు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి.
సంస్థ, పోస్టుల వివరాలు:
సంస్థ పేరు: రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI), డీఆర్డీఓ (DRDO), రక్షణ మంత్రిత్వ శాఖ.
ప్రాంతం: విజ్ఞాన కంచా, హైదరాబాద్, తెలంగాణ
మొత్తం ఖాళీలు: 195 పోస్టులు (పోస్టుల సంఖ్య మారే అవకాశం ఉంది).
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
అధికారిక వెబ్సైట్: drdo.gov.in
విద్యార్హతలు:
ఈ నోటిఫికేషన్ కింద మూడు ప్రధాన కేటగిరీలలో అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (50 పోస్టులు): అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (ECE), ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ (EEE), కంప్యూటర్ సైన్స్ (CSE), మెకానికల్, కెమికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్,సేఫ్టీ,ఏరోనాటికల్, ఏరోస్పేస్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో B.E/B.Tech పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్ (30 పోస్టులు): పైన పేర్కొన్న ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
ట్రేడ్ అప్రెంటిస్ – ITI (115 పోస్టులు): ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్-డీజిల్, ఎలక్ట్రానిక్-మెకానిక్, ఎలక్ట్రిషియన్, COPA, డ్రాఫ్ట్స్‌మెన్ (మెకానికల్), ఐటీఐ (NCVT/SCVT) పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
వయస్సు , అర్హత నిబంధనలు:
కనీస వయస్సు: 1 సెప్టెంబర్ 2026 నాటికి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
మార్కులు: 2022, 2023, 2024, 2025 లేదా 2026 సంవత్సరాలలో అర్హత పరీక్షలో (డిగ్రీ, డిప్లొమా లేదా ఐటీఐ) 70% మార్కులు లేదా 7.5 సీజీపీఏ సాధించిన రెగ్యులర్ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు.
అర్హత లేనివారు: నిర్దేశిత అర్హత కంటే ఎక్కువ చదువుకున్నవారు, ఇప్పటికే అప్రెంటిస్ పూర్తి చేసినవారు లేదా ప్రస్తుతం చేస్తున్నవారు, అలాగే ఒక సంవత్సరం కంటే ఎక్కువ పని అనుభవం ఉన్నవారు అప్లై చేయడానికి అనర్హులు.
స్టైఫండ్ :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం (3 సెప్టెంబర్ 2025 గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా) ప్రతి నెల నిర్దిష్టమైన స్టైపెండ్ చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. కేవలం అకడమిక్ మెరిట్ మార్కులు లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపికైన వారు జాయినింగ్ సమయంలో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్లై చేసుకునే విధానం :
అభ్యర్థులు ముందుగా సంబంధిత అధికారిక పోర్టళ్లలో రిజిస్టర్ చేసుకోవాలి.
B.E/B.Tech/Diploma అభ్యర్థులు: NATS 2.0 పోర్టల్ (nats.education.gov.in) ద్వారా రిజిస్టర్ చేసుకొని, ఎస్టాబ్లిష్మెంట్ ID (STLRAC000010) ని ఉపయోగించి అప్లై చేయాలి.
ITI ట్రేడ్ అభ్యర్థులు: అప్రెంటిస్‌షిప్ ఇండియా పోర్టల్ (apprenticeshipindia.gov.in) ద్వారా రిజిస్టర్ చేసుకొని, ఎస్టాబ్లిష్మెంట్ ID (E05203600040) ద్వారా అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ: నవంబర్ 1వ తేదీ లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.





