డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సైంటిస్ట్ B పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 152 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA), ఇతర మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంస్థలలో సైంటిస్ట్ B పోస్టులను భర్తీ చేస్తారు. DRDO RAC సైంటిస్ట్ B రిక్రూట్‌మెంట్- 2025కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్య వివరాలు:
పోస్టుల సంఖ్య: 152
ఆన్‌లైన్ అప్లికేషన్ చివరి తేదీ: జులై 18, 2025
అధికారిక వెబ్‌సైట్: rac.gov.in.
విద్యార్హత:
ఇంజనీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ (ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ వంటి డిసిప్లిన్‌లకు) లేదా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (ఎంటమాలజీ, బయో స్టాటిస్టిక్స్, సైకాలజీ ) పూర్తి చేసి ఉండాలి. GATE స్కోరు కూడా తప్పనిసరి.
వయస్సు: జూన్ 27, 2025 నాటికి 35 ఏళ్లు నిండి ఉండాలి.
OBC (నాన్-క్రీమీ లేయర్): 38 సంవత్సరాలు.
SC/ST: 40 సంవత్సరాలు.
దివ్యాంగులకు 10 సంవత్సరాలు , ఎక్స్-సర్వీస్‌మెన్, సెంట్రల్ సివిలియన్ గవర్నమెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్ (UR), EWS, OBC (పురుషులు): ₹100/- (ఆన్‌లైన్ చెల్లింపు, నాన్-రీఫండబుల్, నాన్-ట్రాన్స్‌ఫరబుల్)
SC/ST/దివ్యాంగులు/మహిళలు: ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం: నెలకు రూ. 56,100/ (7వ CPC ప్రకారం).
ఎంపిక ప్రక్రియ:
GATE స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్: అభ్యర్థులను GATE స్కోరు ఆధారంగా 1:10 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్‌లో ఎంపికైన అభ్యర్థులు ఢిల్లీ లేదా RAC/DRDO నిర్ణయించిన ఇతర స్థలంలో పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
ఫైనల్ సెలక్షన్: GATE స్కోరుకు 80% వెయిటేజ్, పర్సనల్ ఇంటర్వ్యూలో 20% వెయిటేజ్ ఆధారంగా ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు.
మెడికల్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఎంపికైన అభ్యర్థులు మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
ఆన్‌లైన్ అప్లికేషన్ విధానం:
1.అధికారిక RAC వెబ్‌సైట్ rac.gov.in లోకి లాగిన్ అవ్వండి.
- హోమ్‌పేజీలో కుడి వైపు పై భాగంలో ఉన్న “Candidate Login” బటన్‌పై క్లిక్ చేయండి.
3.”Register” బటన్‌పై క్లిక్ చేసి, అవసరం అయిన వివరాలు ఎంటర్ చేయండి.
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో, సంతకం, అవసరమైన డాక్యుమెంట్లు స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయండి.
5.అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లించండి.
- అప్లికేషన్ ఫారమ్‌ను సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.