భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL), 2026-27 సంవత్సరానికి గాను ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్‌సీవీటీ (NCVT) సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌తో పాటు ఫిజికల్ అప్లికేషన్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు:
మొత్తం 13 రకాల ట్రేడ్‌లు
ఫిట్టర్
టర్నర్
మెషినిస్ట్
మెషినిస్ట్ (గ్రైండర్)
కార్పెంటర్
వెల్డర్
ఎలక్ట్రీషియన్
డీజిల్ మెకానిక్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
అటెండెంట్ ఆపరేటర్
కెమికల్ ప్లాంట్
పెయింటర్
కోపా
ఫౌండ్రీమెన్
అర్హతలు:
1.సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
2.ఇంతకుముందు ఎక్కడా అప్రెంటిస్ శిక్షణ పొంది ఉండకూడదు.
స్టైపెండ్:
ఒక సంవత్సరం (01 ఏప్రిల్ 2026 నుంచి 31 మార్చి 2027 వరకు) అప్రెంటిస్ ఫిప్ ఉంటుంది. ఈ సమయంలో భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం నెలవారీ స్టైపెండ్ చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీ:
ఆన్‌లైన్ ఆఫ్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ జనవరి 29 (సాయంత్రం 5 గంటలు).
ఎంపిక విధానం:
అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్క్రీనింగ్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది.
అప్లికేషన్ విధానం:
ఈ ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
1.మొదటగా www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో 100% ప్రొఫైల్ పూర్తి చేసి అప్లై చేయాలి. దీనికి ఆధార్ కార్డ్ లింక్ తప్పనిసరి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ తర్వాత, అప్లికేషన్ ఫారమ్‌ను నింపి, దానికి టెన్త్, ఐటీఐ, క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్‌లను జత చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ కవర్‌లో ఉంచి, దానిపై “APPLICATION FOR ITI APPRENTICESHIP TRAINING AT DRDL” అని రాసి.. ఈ కింది అడ్రస్‌కు పంపాలి.
- The Director, DRDL, Kanchanbagh, Hyderabad – 500058. (లేదా నేరుగా DRDL మెయిన్ గేట్ వద్ద ఉన్న బాక్స్‌లో వేయవచ్చు).





