డిఫెన్స్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే వారికి గొప్ప అవకాశం. హైదరాబాద్‌లోని డీఆర్డీఓ సంస్థ.. 2026-27 విద్యా సంవత్సరంలో బీఈ/బీటెక్ ఫైనల్ ఇయర్‌లోకి అడుగుపెట్టే వారి కోసం 75 పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశాలను ప్రకటించింది. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ విభాగాలకు చెందిన వారు ఇందుకు అప్లై చేసుకోవచ్చు. 6 నెలల పాటు సాగే ఈ ఇంటర్న్‌షిప్‌లో స్టైపెండ్ కూడా ఇస్తారు. మే 15 లోపు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
DRDO DLRL పెయిడ్ ఇంటర్న్‌షిప్ వివరాలు:
ఖాళీల వివరాలు:
మొత్తం 75 ఇంటర్న్‌షిప్ పోస్టులు ఉన్నాయి. వీటిని మూడు విభాగాల్లో కేటాయించారు.
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్: 40
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్: 25
మెకానికల్ ఇంజనీరింగ్: 10
అర్హతలు:
1.అప్లై చేసుకునే వారు 2026-2027 విద్యా సంవత్సరంలో B.E/B.Tech ఫైనల్ ఇయర్ చదివేవారై ఉండాలి.
2.ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు.
- సంబంధిత కాలేజీ నుంచి తప్పనిసరిగా ‘రిఫరల్/స్పాన్సర్‌షిప్ లెటర్’ కలిగి ఉండాలి.
స్టైపెండ్ :
ఎంపికైన అభ్యర్థులకు 6 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. మొత్తం రూ. 30,000 స్టైపెండ్‌ను రెండు వాయిదాల్లో (3 నెలలకు ఒకసారి రూ. 15,000 ) చెల్లిస్తారు. నెలకు కనీసం 15 రోజుల హాజరు తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ:
మెరిట్ ప్రాతిపదికన (3వ సంవత్సరం 1వ సెమిస్టర్ వరకు వచ్చిన మార్కులు/CGPA) అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అవసరమైతే ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్ నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.అప్లికేషన్ విధానం
1.అధికారిక వెబ్‌సైట్ drdo.gov.in నుంచి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2.అప్లికేషన్ ఫారమ్ పూర్తి చేసి ఆధార్ కార్డ్ కాపీ, కాలేజీ ఐడీ, బోనఫైడ్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోలు యాడ్ చేయాలి.
3. పూర్తి చేసిన అప్లికేషన్ ఈ కింది చిరునామాకు పోస్ట్ ద్వారా పంపాలి.
The Director,
Defence Electronics Research Laboratory
Chandrayangutta Lines, Hyderabad – 500 005.
ముఖ్య గమనిక: అప్లికేషన్ ఫారం పంపడానికి చివరి తేదీ మే 15. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.





