HomeJOBSడీఆర్‌డీఓలో 764 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

డీఆర్‌డీఓలో 764 ఉద్యోగాలు.. అప్లై చేశారా ?

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO),సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్ (CEPTAM) ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేఫన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 764 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B), టెక్నీషియన్-ఎ (Tech-A) పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి విద్యార్హత నిర్ణయించారు. 18 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

పూర్తి వివరాలు:

మొత్తం పోస్టులు : 764

విభాగాల వారిగా పోస్టులు..

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (STA-B)- 561 పోస్టులు

టెక్నీషియన్-ఎ (Tech-A)- 203 పోస్టులు

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ చివరి తేదీ: జనవరి 11 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 13 వరకు ఫీజు చెల్లించవచ్చు.

విద్యార్హతలు:

 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి: సంబంధిత సబ్జెక్టులో B.Sc లేదా ఇంజనీరింగ్‌లో 3 ఏళ్ల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

టెక్నీషియన్-ఎ: టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

ముఖ్య గమనిక: B.E, B.Tech, M.Sc, Ph.D వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అనర్హులు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

జీతం:

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-బి (Level 6)పోస్టులు: ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 35,400 నుంచి రూ. 1,12,400 వరకు ఉంటుంది.

టెక్నీషియన్-ఎ పోస్టులు: ఎంపికైన అభ్యర్థులకు జీతం రూ. 19,900 నుంచి రూ. 63,200 వరకు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: సాధారణ/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ. 100 లేదా రూ. 250 ఫీజుతో పాటు రూ. 500 రీఫండబుల్ ఫీజు ఉంటుంది. ఈ రూ. 500 అభ్యర్థి Tier-I పరీక్షకు హాజరైతే తిరిగి చెల్లిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం:

ఎంపిక ప్రధానంగా రెండు దశల్లో ఉంటుంది.

Tier-I (CBT): కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష.

Tier-II (CBT/Trade Test): STA-B కి డిస్క్రిప్టివ్ లేదా ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్ ఉంటుంది. చివరగా మెడికల్ ఫిట్‌నెస్,డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

పూర్తి వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

WhatsApp Please
SHARE