ఇంటర్ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ విద్యార్థులకు సూచించారు. హాల్ టికెట్ పై పేరు, ఫొటో, సంతకం, మీడియం, సబ్జెక్టులు వంటి అంశాలను పరిశీలించి, తప్పులేమైనా ఉంటే వెంటనే ప్రిన్సిపల్ దృష్టికి తీసుకుపోవాలని.. డీఐఈఓ ద్వారా సరిచేసుకోవాలన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై కాలేజీ ప్రిన్సిపల్ పేరు లేకున్నా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తారని చెప్పారు.
విద్యార్థులు హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ను ఫాలో కావాలి. ముందుగా అఫిషియల్ వెబ్సైట్లో ఉన్న హాల్‌టికెట్ పేజీని ఎంచుకోవాలి. ఇక్కడి లింక్ లున్నాయి. వీటిలో వేటిని క్లిక్ చేసినా హాల్‌టికెట్ల వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
ఇంటర్ బోర్డు అఫిషియల్ వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/
CLICK HERE FOR FIRST YEAR HALL TICKETS
CLICK HERE FOR SECOND YEAR HALL TICKETS
Step 1: విద్యార్థులు వారు చదువుతున్న ఇయర్ ఆధారంగా పై ఆప్షన్లపై క్లిక్ చేయాలి.
Step 2: ఫస్ట్ ఇయర్ విద్యార్థులు SSC హాల్ టికెట్ నంబర్, సెకండియర్ విద్యార్థులు Step 6: డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేసి Get Hall Ticket ఆప్షన్ ను ఎంచుకోవాలి.
Step 3: దీంతో హాల్ టికెట్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి.