తెలంగాణాలో 2022–23 విద్యాసంవత్సరం డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదలైంది. బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ‘దోస్త్’ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు జులై 01 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 01 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
తెలంగాణాలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని 1,060 కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ తదితర డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. బీఏ, బీఎస్సీ, బీకాం, బీకాం వొకేషనల్, బీకాం ఆనర్స్, బీఎస్‌డబ్ల్యూ, బీబీఏ, బీబీఎం, బీసీఏతో పాటు ఇతర కోర్సుల్లో దోస్త్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మూడు లేదా నాలుగు విడతల్లో డిగ్రీ సీట్లను భర్తీ చేయనున్నారు.
డిగ్రీ ప్రవేశాలు పొందాలనుకుంటున్న విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ లేదా టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని సహాయ కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
దోస్త్ షెడ్యూల్ ఇదే..
దోస్త్ ఫస్ట్ ఫేజ్ జూలై 1 నుంచి 30వరకు
వెబ్ ఆప్షన్ జూలై 6 నుంచి 30వ తేదీ వరకు
ఫేజ్ 1 సీట్స్ కేటాయింపు ఆగస్టు 6
ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ఆగస్టు 7 నుంచి ఆగస్టు 21 వరకు
వెబ్ ఆప్షన్ ఆగస్టు 7 నుంచి ఆగస్టు 22 వరకు
ఫేజ్ 2 సీట్స్ అలాట్ మెంట్ ఆగస్టు 27
ఫేజ్ 3 రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 12 వరకు
ఫేజ్ 3 సీట్స్ అలాట్ మెంట్ సెప్టెంబర్ 16
అక్టోబర్ 1 నుంచి డిగ్రీ రెగ్యులర్ తరగతులు ప్రారంభం
Deaf job apply
Degree addmission