తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన DOST 2026-27 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TGCHE), హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో BA, B.Sc, B.Com, B.Com (Voc), B.Com (Hons), BSW, BBA, BCA తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు స్వీకరించనున్నారు. ఈ అడ్మిషన్లు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, శాతవాహన, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వంటి తదితర యూనివర్సిటీలకు అను బంధంగా ఉన్న కాలేజీల్లో ఉంటాయి. అలాగే SBTETకు అనుబంధంగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో D-Pharmacy కోర్సులకు కూడా DOST ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
అర్హతలు ,రిజిస్ట్రేషన్ ఫీజు:
తెలంగాణ ఇంటర్ బోర్డు లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డులు/రాష్ట్రాల నుంచి ఇంటర్ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అన్ని కాలేజీలు లేదా ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీలకు సంబంధించిన కోర్సుల కోసం ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. ఈ ఫీజును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, UPI, BillDesk, Atom వంటి విధానాల ద్వారా చెల్లించవచ్చు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ dost.cgg.gov.in ను సందర్శించవచ్చు.
ఫేజ్-1 షెడ్యూల్:
DOST షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13, 2026న నోటిఫికేషన్ విడుదలైంది. ఫేజ్-1 రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్లు ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు ఇవ్వవచ్చు. ప్రత్యేక కేటగిరీ సర్టిఫికెట్ల ధృవీకరణలో PH/CAP అభ్యర్థులకు మే 7, NCC/స్పోర్ట్స్/ఎక్స్‌ట్రా కరిక్యులర్ అభ్యర్థులకు మే 8 తేదీలు నిర్ణయించారు. ఫేజ్-1 సీట్ల కేటాయింపు మే 14న జరుగుతుంది. సీటు వచ్చిన విద్యార్థులు మే 15 నుంచి 23 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫేజ్-2 షెడ్యూల్:
ఫేజ్-2 రిజిస్ట్రేషన్ మే 15 నుంచి 25 వరకు ఉంటుంది. ఇందుకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.400. ఫేజ్-2 వెబ్ ఆప్షన్లు మే 15 నుంచి 26 వరకు ఇవ్వవచ్చు. ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ మే 26న ఉంటుంది. ఫేజ్-2 సీట్ల కేటాయింపు మే 30న జరుగుతుంది. ఆ తర్వాత మే 31 నుంచి జూన్ 5 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫేజ్-3 షెడ్యూల్:
ఫేజ్-3 రిజిస్ట్రేషన్ మే 31 నుంచి జూన్ 15 వరకు, వెబ్ ఆప్షన్లు మే 31 నుంచి జూన్ 16 వరకు కొనసాగుతాయి. ప్రత్యేక కేటగిరీ ధృవీకరణ జూన్ 16న ఉంటుంది. ఫేజ్-3 సీట్ల కేటాయింపు జూన్ 20న జరుగుతుంది. ఈ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 25 వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3లో సీట్లు ఆన్‌లైన్‌లో కన్ఫర్మ్ చేసుకున్న విద్యార్థులు జూన్ 20 నుంచి 27 వరకు కాలేజీలకు రిపోర్ట్ చేయాలి. కాలేజీల్లో స్టూడెంట్స్ ఒరియంటేషన్ జూన్ 29, 30 తేదీల్లో నిర్వహిస్తారు. సెమిస్టర్-1 తరగతులు జూలై 1నుంచి ప్రారంభం అవుతాయి.
ముఖ్యమైన తేదీలు:
| అంశం | తేదీలు |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 13-04-2026 |
| ఫేజ్-1 రిజిస్ట్రేషన్ | 15-04-2026 నుంచి 07-05-2026 వరకు |
| ఫేజ్-1 వెబ్ ఆప్షన్లు | 30-04-2026 నుంచి 08-05-2026 వరకు |
| PH/CAP వెరిఫికేషన్ | 07-05-2026 |
| NCC/స్పోర్ట్స్/ఎక్స్‌ట్రా కరిక్యులర్ ధృవీకరణ | 08-05-2026 |
| ఫేజ్-1 సీట్ల కేటాయింపు | 14-05-2026 |
| ఫేజ్-1 సెల్ఫ్ రిపోర్టింగ్ | 15-05-2026 నుంచి 23-05-2026 వరకు |
| ఫేజ్-2 రిజిస్ట్రేషన్ | 15-05-2026 నుంచి 25-05-2026 వరకు |
| ఫేజ్-2 వెబ్ ఆప్షన్లు | 15-05-2026 నుంచి 26-05-2026 వరకు |
| ఫేజ్-2 ప్రత్యేక కేటగిరీ వెరిఫికేషన్ | 26-05-2026 |
| ఫేజ్-2 సీట్ల కేటాయింపు | 30-05-2026 |
| ఫేజ్-2 సెల్ఫ్ రిపోర్టింగ్ | 31-05-2026 నుంచి 05-06-2026 వరకు |
| ఫేజ్-3 రిజిస్ట్రేషన్ | 31-05-2026 నుంచి 15-06-2026 వరకు |
| ఫేజ్-3 వెబ్ ఆప్షన్లు | 31-05-2026 నుంచి 16-06-2026 వరకు |
| ఫేజ్-3 ప్రత్యేక కేటగిరీ వెరిఫికేషన్ | 16-06-2026 |
| ఫేజ్-3 సీట్ల కేటాయింపు | 20-06-2026 |
| ఫేజ్-3 సెల్ఫ్ రిపోర్టింగ్ | 20-06-2026 నుంచి 25-06-2026 వరకు |
| కాలేజీలకు రిపోర్టింగ్ | 20-06-2026 నుంచి 27-06-2026 వరకు |
| స్టూడెంట్స్ ఒరియంటేషన్ | 29-06-2026 నుంచి 30-06-2026 వరకు |
| సెమిస్టర్-1 తరగతుల ప్రారంభం | 01-07-2026 |





