HomeLATESTపీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు ‘టిస్​’ నోటిఫికేషన్​

పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు ‘టిస్​’ నోటిఫికేషన్​

50 పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు దేశంలో పేరున్న విద్యాసంస్థల్లో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (టిస్‌) నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ కోర్సులకు ఇది ప్రసిద్ధి చెందింది. ఇక్కడి సోషల్‌ వర్క్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. వైవిద్యమైన కోర్సులను విస్తృత స్పెషలైజేషన్లతో అందించడం టిస్‌ ప్రత్యేకత. మొత్తం 50 పీజీ కోర్సులను ఈ సంస్థ ముంబయి, తుల్జాపూర్, హైదరాబాద్, గువాహటి క్యాంపస్‌ల్లో అందిస్తోంది.

క్యాంపస్​లు–సీట్లు

టిస్‌ ముంబయి క్యాంపస్‌లో 32, హైదరాబాద్‌లో 6, తుల్జాపూర్‌లో 4, గువాహటిలో 8 పీజీ కోర్సులు ఉన్నాయి. ఏ కోర్సులో చేరాలనుకున్నప్పటికీ స్టేజ్‌-1 పరీక్ష అందరికీ ఉమ్మడిగానే ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చదువుకున్న అంశాలతో ఎలాంటి సంబంధం లేదు. ప్రశ్నలన్నీ జనరల్‌ విభాగానికి చెందినవే వస్తాయి. వివిధ పీజీ కోర్సులకు సాధారణ డిగ్రీ విద్యార్హతతో పోటీ పడే అవకాశం కల్పించారు. కొన్ని కోర్సులకు మాత్రం సంబంధిత విభాగంలో యూజీ పూర్తిచేసినవారే అర్హులు. అభ్యర్థులు చేరిన కోర్సులను బట్టి ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంహెచ్‌ఏ, ఎంపీహెచ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తారు. ప్రతి అభ్యర్థి గరిష్ఠంగా 3 ప్రోగ్రామ్‌లకు అప్లై చేసుకోవచ్చు.

అందిస్తున్న కోర్సులు

ఎడ్యుకేషన్‌ (ఎలిమెంటరీ), డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఉమెన్‌ స్టడీస్, క్లైమేట్‌ చేంజ్‌ సస్ట్టెయినబిలిటీ స్టడీస్, రెగ్యులేటరీ గవర్నెన్స్, అర్బన్‌ పాలసీ గవర్నెన్స్, వాటర్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, అప్లయిడ్‌ సైకాలజీ (క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌), గ్లోబలైజేషన్‌ అండ్‌ లేబర్‌; హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్, చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌; సోషల్‌ ఆంత్రపెన్యూర్‌షిప్, మీడియా అండ్‌ కల్చరల్‌ స్టడీస్, డెవలప్‌మెంట్‌ పాలసీ, ప్లానింగ్‌ అండ్‌ ప్రాక్టీస్‌; సస్ట్టెయినబుల్‌ లైవ్లీహుడ్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ గవర్నెన్స్‌; సోషల్‌ ఇన్నొవేషన్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్, సోషల్‌ వర్క్‌ ఇన్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, సోషల్‌ వర్క్‌ (చిల్డ్రన్‌ అండ్‌ ఫ్యామిలీస్‌ / కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ క్రిమినాలజీ అండ్‌ జస్టిస్‌/ దళిత్, ట్రైబల్‌ స్టడీస్‌ అండ్‌ యాక్షన్‌/ లైవ్‌లీ హుడ్స్‌ అండ్‌ సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్స్‌/ మెంటల్‌ హెల్త్‌/ పబ్లిక్‌ హెల్త్‌/ ఉమెన్‌ సెంటర్డ్‌ ప్రాక్టీస్‌/ కమ్యూనిటీ ఆర్గనైజేషన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ప్రాక్టీస్‌/ కౌన్సెలింగ్‌), డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ గవర్నెన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఎకాలజీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్ట్టెయినబుల్‌ డెవలప్‌మెంట్, లేబర్‌ స్టడీస్‌ అండ్‌ సోషల్‌ ప్రొటెక్షన్‌/ పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్టడీస్, సోషియాలజీ అండ్‌ సోషల్‌ ఆంత్రపాలజీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంహెచ్‌ఎ), పబ్లిక్‌ హెల్త్‌ (హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌/ హెల్త్‌ పాలసీ, ఎకనామిక్స్‌ అండ్‌ ఫైనాన్స్‌/ సోషల్‌ ఎపిడమాలజీ), ఎల్‌ఎల్‌ఎం, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌-ఎంఎడ్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌.

సెలెక్షన్​ ప్రాసెస్​

ఏ కోర్సు ఎంచుకున్నప్పటికీ టిస్‌-నెట్‌ రాయాలి. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి స్టేజ్‌ 2 పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ప్రోగ్రామింగ్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు (పీఏటీ), ఆన్‌లైన్‌ పర్సనల్‌ ఇంటర్వ్యూ (ఓపీఐ) ఉంటాయి. తుది ఎంపికలో టిస్‌-నెట్, పీఏటీకి, ఓపీఐ..ఈ మూడింటికీ వెయిటేజీ ఉంటుంది. హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ లేబర్‌ రిలేషన్స్, ఆర్గనైజేషన్‌ డెవలప్‌మెంట్‌ చేంజ్‌ అండ్‌ లీడర్‌షిప్‌ ఈ రెండు కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారు పీఏటీ స్థానంలో టిస్‌ మ్యాట్‌ రాయాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి వంద నిమిషాలు. ప్రశ్నలన్నీ ఆంగ్ల మాధ్యమంలోనే వస్తాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ 40, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ 30, మ్యాథ్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 30 మార్కులకు ఉంటాయి. రుణాత్మక మార్కులు లేవు. ఇంగ్లిష్, రీజనింగ్, మ్యాథ్స్‌ విభాగాల్లోని ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. జనరల్‌ అవేర్‌నెస్‌లో కటాఫ్‌ మార్కులు పొందడం తప్పనిసరి.

సిలబస్​

ఇంగ్లిష్‌: వర్డ్‌ ఛాయిస్‌/ సెంటెన్స్‌ కరెక్షన్, ఆడ్‌ వన్‌ అవుట్, ఎనాలజీస్, సిననిమ్స్‌ అండ్‌ యాంటనిమ్స్, గ్రామర్, వెర్బల్‌ రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌.

మ్యాథమేటిక్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌: అరిథ్‌మెటిక్, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, స్టాటిస్టిక్స్, నంబర్‌ సిరీస్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్‌ రీజనింగ్‌ల్లో ప్రాథమికాంశాల నుంచి ప్రశ్నలుంటాయి.

జనరల్‌ అవేర్‌నెస్‌:
వర్తమాన సంఘటనలు, అభివృద్ధి, సాంఘిక రాజకీయాంశాలు, పాలిటిక్స్, సోషల్‌ స్టడీస్, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్‌ అండ్‌ కల్చర్, ఇండియన్‌ హిస్టరీ.

హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఎంఏ

ఎడ్యుకేషన్, పబ్లిక్‌ పాలసీ అండ్‌ గవర్నెన్స్, డెవలప్‌మెంట్‌ స్టడీస్, నేచురల్‌ రిసోర్స్‌ అండ్‌ గవర్నెన్స్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ గవర్నెన్స్, ఉమెన్‌ స్టడీస్‌ కోర్సులు ఉన్నాయి.

దరఖాస్తులకు చివరి తేదీ: 7 ఫిబ్రవరి

పరీక్ష​: 26 ఫిబ్రవరి
ఎగ్జామ్​ సెంటర్స్​: హైదరాబాద్, విశాఖపట్నం
వెబ్‌సైట్‌: www.admissions.tiss.edu

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!