గుంటూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 45 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టెన్త్ నుంచి ఫార్మసీ వరకు వివిధ విద్యార్హతలు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు జనవరి 22 నుంచి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2వ తేదీ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు చివరి తేదీలోపు అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తున్నారు. విభాగాల వారిగా..
ల్యాబ్ టెక్నీషియన్ : 08 పోస్టులు
ఫార్మాసిస్ట్ : 01 పోస్టు
డేటా ఎంట్రీ ఆపరేటర్ – DEO:03 పోస్టులు
శానిటరీ అటెండెంట్ / LGS:06 పోస్టులు
ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ – FNO:07 పోస్టులు
శానిటరీ అటెండెంట్ కమ్ నైట్ వాచ్‌మెన్ : 20 పోస్టులు
విద్యార్హతలు:
ఫార్మాసిస్ట్: బీఫార్మసీ/డీఫార్మసీ/ఎం.ఫార్మసీతో పాటు ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
DEO:ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్: DMLTలేదా B.Sc MLT కోర్సు పూర్తి చేసి ఉండాలి.
ఇతర పోస్టులు: శానిటరీ అటెండెంట్, FNO పోస్టులకు టెన్త్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లకు మించకూడదు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
అప్లికేషన్ ఫీజు: బీసీ, ఓసీ అభ్యర్థులకు రూ. 800, ఎస్సీ,ఎస్సీ,పీహెచ్ అభ్యర్థులకు రూ. 500 గా నిర్ణయించారు.
చివరి తేదీ:
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఫిబ్రవరి 2వ తేదీ లోపు నేరుగా గుంటూరు DMHO ఆఫీసులో సమర్పించాలి.
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ guntur.ap.gov.in ను సందర్శించవచ్చు.





