HomeJOBSచిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. డోంట్ మిస్

చిత్తూరు జిల్లా ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు.. డోంట్ మిస్

చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 22 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు DMHO చిత్తూరు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు:
56
సంస్థ పేరు: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, చిత్తూరు
పోస్టుల పేరు: సపోర్టింగ్ స్టాఫ్, మెడికల్ ఆఫీసర్, ఇతర పోస్టులు
విద్యార్హత: పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. అభ్యర్థులు B.Sc, MBBS,, GNM, BPT, CA, ICWA, M.Com, DMLTA లలో ఏదైనా అర్హత కలిగి ఉండాలి.
వయస్సు: 42 సంవత్సరాలలోపు వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: chittoor.ap.gov.in

పోస్టుల వారీగా ఖాళీలు, జీతం:
మెడికల్ ఆఫీసర్(13)- రూ. 61,960
స్టాఫ్ నర్సులు(20)- రూ.27,675
ఫైనాన్స్ కమ్ లాజిస్టిక్ కన్సల్టెంట్(01)- రూ.42,791
ల్యాబ్-టెక్నీషియన్ గ్రూప్-II(03)- రూ.23,393
ఫిజియోథెరపిస్ట్-(01)- రూ. 23,494
ఆడియోమెట్రీషియన్ (NPCDCS కింద)(02)- రూ.25,526
శానిటరీ అటెండెంట్(02) – రూ. 15,000
సపోర్టింగ్ స్టాఫ్(04)-రూ. 15,000
సెక్యూరిటీ గార్డ్(02)-రూ. 15,000
లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్(08)- రూ.15,000.

అప్లికేషన్ ఫీజు, ఎంపిక విధానం:
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు రూ.500 ఫీజును “District Medical & Health Officer, Chittoor” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (DD) ద్వారా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను మొత్తం 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://chittoor.ap.gov.in నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాలి. పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారమ్‌కు, నోటిఫికేషన్‌లో సూచించిన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్‌లను జతచేయాలి.

అప్లికేషన్ కవర్‌పైన “Application for the post of..” అని స్పష్టంగా పోస్టు పేరును రాయాలి. లేదంటే అభ్యర్థి స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆఫీస్, చిత్తూరులో అక్టోబర్ 22 లోపు నేరుగా సబ్మిట్ చేయవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here