టీఎస్ టెట్–2022 దరఖాస్తు గడువు ముగిసింది. మొత్తం 6,26,928 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో పేపర్–1కు 3,50,205, పేపర్–2కు 2,276,723 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం 3,79,101 మంది అభ్యర్థులు రెండు పేపర్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీఈడీ, డీఈడీ అభ్యర్థులున్నారు. కేవలం పేపర్–1కు మాత్రమే దరఖాస్తు చేసిన వారు 1,01,378 మంది అభ్యర్థులు, పేపర్–2కు మాత్రమే 28,896 మంది, పేపర్–1, పేపర్–2 రెండింటికి అప్లై చేసిన వారు 2,47,827 మంది అభ్యర్థులున్నారు.
జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు
- ఆదిలాబాద్ –8000
- భద్రాద్రి కొత్తగూడెం–10,080
- హన్మకొండ–15000
- హైదరాబాద్–30,000
- జగిత్యాల–10,370
- జయశంకర్ భూపాలపల్లి–2,160
- జనగాం–7,200
- జోగులాంబ గద్వాల–8,160
- కామారెడ్డి–5,760
- కరీంనగర్–18,720
- ఖమ్మం–19,920
- కొమరంభీం ఆసీఫాబాద్–5,040
- మహబూబాబాద్–6,720
- మహబూబ్‌నగర్–20,160
- మంచిర్యాల–12,000
- మెదక్–9,360
- మేడ్చల్–7,500
- ములుగు–1,920
- నాగర్‌కర్నూల్–12,000
- నల్గొండ–24,841
- నారాయణపేట–6,240
- నిర్మల్–8,160
- నిజామాబాద్–17,760
- పెద్దపల్లి–5,280
- రాజన్నసిరిసిల్ల–7,473
- రంగారెడ్డి–22,878
- సంగారెడ్డి–18,000
- సిద్దిపేట–10,631
- సూర్యాపేట–14,888
- వికారాబాద్–6,000
- వనపర్తి–9,600
- వరంగల్–9,120
- యాదాద్రి భువనగిరి–8,160
- మొత్తం 3,79,101
టెట్ అభ్యర్థులకు షాకింగ్ న్యూస్
అప్లికేషన్లో తప్పులుంటే.. నో ఎంట్రీ
టీఎస్ టెట్–2022 దరఖాస్తులో తప్పులు దొర్లిన వాటిపై విద్యాశాఖ సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. ఇప్పటి వరకు టెట్ అప్లికేషన్లో తప్పులను సవరించుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వకపోగా.. పేర్లు, పుట్టినతేది, ఫొటో కింద సంతకం లేకుండా దరఖాస్తు చేసిన అభ్యర్థులను టెట్పరీక్షకు అనుమతించబోమని ఎస్ఈఆర్టీ అధికారులు చెబుతున్నారు.
తెలంగాణాలో సుమారు ఐదేళ్ల తర్వాత నిర్వహించిన టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్‌కు అనూహ్యంగా 6లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు కలిపి సుమారు 3.5లక్షల మంది ఉన్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా పేర్లు, పుట్టిన తేదీ వివరాలు, జెండర్, పేరెంట్స్ వివరాలు, స్టడీ డిటెయిల్స్, ప్రీవియస్ టెట్ హాల్‌టికెట్ నంబర్స్, స్టడీ క్వాలిఫికేషన్స్, డీఈడీ, బీఈడీ కోర్సు చదివిన కాలేజీల ఎంపిక తదితర వివరాల నమోదులో తప్పులు దొర్లాయి. పలువురు అభ్యర్థులు ఫొటో కింద సంతకాలు లేకుండా అప్లికేషన్‌ను సబ్మిట్ చేశారు. అయితే ఇంకొందరికి ఫొటోలు మారిపోగా, కొందరివి సంతకాలు అప్డేట్ కాలేదు. అయితే అప్లికేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఎడిట్ ఆప్షన్ ఇస్తారనీ, ఆ టైమ్ లో వాటిని సవరించుకోవచ్చని అంతా భావించారు. కానీ చివరి నిమిషం వరకూ దానిపై స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్సీఈఆర్టీ అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వలేదు. అయితే కొందరు ముందుగానే కొత్తగా మళ్లీ అప్లై చేయగా, చాలామంది దరఖాస్తు చేయలేదు. అయితే అప్లికేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో, ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోమని చెప్తున్నారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
పేర్లు, డేటాఫ్ బర్త్ తప్పు ఉంటే కష్టమే…
Tet application lo signature upload aiyindi kani photo upload kaledu. Any problem?please give me response.Is there any alternative
Please
Give edit option
5 years after tet process
It’s eligibility not job
Give chance for edit
Date extension chesthara
Tet application apply and edit option provide for us because this exam is long time conducting, this is only eligibilty test for DSC not given to job
Tet lo signature upload ayndhi photo upload avvatledhu
Signiture not upload plz edit options..
Signiture not upload
Ok ok sir but 1 day application date evvandi sir please
Pl extend TET applying Date
I have enter correct date of birth but computer is not taken correct year plz give me edit chance