HomeADMISSIONSరేపటి నుంచే.. డీఈఈసెట్ ఫైనల్ కౌన్సెలింగ్

రేపటి నుంచే.. డీఈఈసెట్ ఫైనల్ కౌన్సెలింగ్

విద్యారంగంలో ఉపాధ్యాయులుగా.. స్థిరపడాలనుకునే అభ్యర్థులకు అలర్ట్. రెండు సంవత్సరాల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్ (DEECET-2026) మూడో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. వివిధ విద్యా సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీ ప్రక్రియ జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు.. డీఈఈసెట్ కన్వీనర్ జీ రమేశ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు నిర్దేశిత గడువులోపు ప్రవేశ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలని తెలిపారు.

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్:

డీఈఈసెట్ రాసి ఇంకా సీటు రాని అభ్యర్థులకు.. లేదా మొదటి రెండు విడతల్లో సీటు వచ్చి నచ్చని వాళ్లకు ఈ మూడో విడత కౌన్సెలింగ్ చాలా ముఖ్యం.

  1. జూన్ 29: సర్టిఫికెట్ వెరిఫికేషన్:
    కౌన్సెలింగ్‌లో మొదటి అడుగు సర్టిఫికెట్ వెరిఫికేషన్. జూన్ 29న అభ్యర్థులు తమ ఒరిజినల్ డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండాలి. మీ టెన్త్ మార్క్స్ మెమో, ఇంటర్ సర్టిఫికెట్, డీఈఈసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ , ఇన్‌కమ్ సర్టిఫికెట్లను రెడీ చేసి ఉంచుకోండి.
  2. జూన్ 30: వెబ్ ఆప్షన్లు
    సర్టిఫికెట్ వెరిఫికేషన్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిన అభ్యర్థులు జూన్ 30వ తేదీన ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కాలేజీలను వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవాలి.
    ఖాళీగా ఉన్న సీట్ల వివరాలుచూసుకొని, ఎక్కువ ఆప్షన్లు ఇస్తే సీటు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది.
  3. జులై 4: సీట్ల కేటాయింపు ఫలితాలు
    వెబ్ ఆప్షన్స్ ఆధారంగా మెరిట్, రిజర్వేషన్లను బట్టి జులై 4న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో మీ మొబైల్‌కు మెసేజ్ వస్తుంది లేదా అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4.కోర్సు ఫీజు, కాలేజ్ రిపోర్టింగ్ వివరాలు:
సీటు సాధించిన అభ్యర్థులు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవడానికి కింది ప్రాసెస్ ఫాలో అవ్వాలి.

ట్యూషన్ ఫీజు: ప్రభుత్వం నిర్ణయించిన రూల్స్ ప్రకారం ప్రభుత్వ డీఐఈటీ (DIET) కాలేజీల్లో.. ఫీజు చాలా తక్కువగా (సుమారు రూ.2,500 నుంచి రూ.3,000) ఉంటుంది. ప్రైవేట్ కాలేజీల్లో సీటు వస్తే.. అది సుమారు రూ.12,500 నుంచి రూ. 15,000 వరకు మారే అవకాశం ఉంది.

కాలేజీ రిపోర్టింగ్ గడువు: జులై 4 నుంచి జులై 6 లోపు ఆన్‌లైన్‌లో ట్యూషన్ ఫీజు చెల్లించి, అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు సంబంధిత కాలేజీకి వెళ్లి ఫిజికల్‌గా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

ముఖ్య గమనిక: జులై 6 లోపు రిపోర్ట్ చేయని అభ్యర్థుల సీటు ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుందని అధికారులు వెల్లడించారు.

జులై 8,9 తేదీల్లో స్లైడింగ్,సీట్ల కన్వర్షన్:
ఒకవేళ మూడో విడతలో సీటు వచ్చినప్పటికీ కాలేజీ నచ్చకపోతే.. అభ్యర్థులకు జులై 8,9 తేదీల్లో స్లైడింగ్, సీట్ల కన్వర్షన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ అవకాశాన్ని వాడుకునే.. వాళ్లు ఆయా తేదీల్లోనే సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్ చేసి తమ అడ్మిషన్ ఫైనల్‌గా క్లోజ్ చేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here