Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ అఫైర్స్​‌‌– స్పోర్ట్స్​ (జనవరి 2020)

కరెంట్ అఫైర్స్​‌‌– స్పోర్ట్స్​ (జనవరి 2020)

స్పోర్ట్స్

చెస్ ఛాంపియన్ హంపి

రష్యాలోని మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య(ఫిడె) మహిళల ప్రపంచ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌ను 2019కి ఇండియన్ మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి గెల్చుకున్నారు. డిసెంబర్ 26 నుంచి 28 వరకు జరిగిన ఫైనల్స్‌లో చైనాకు చెందిన లీ టింగ్ జీ సిల్వర్ గెల్చుకుంది. 2017లో ఆనంద్ తర్వాత ఈ టైటిల్ గెల్చిన రెండో ఇండియన్ హంపినే.

సీమాపై నిషేధం

భారత వెయిట్ లిఫ్టర్ సీమ డోప్‌ టెస్టులో విఫలమవడంతో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఆమెపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. విశాఖపట్నం కేంద్రంగా జరిగిన జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌ సందర్భంగా శాంపిల్ సేకరించారు. దీనిలో నిషేధిత టామోగ్జిఫెన్ ఉండడంతో నిషేధం విధించారు. ఇప్పటికే నాడాచే రవికుమార్(షూటింగ్), సుమిత్ సంగ్వాన్ నిషేధానికి గురయ్యారు.

ముజిబుర్ రహమాన్ రికార్డు

అఫ్గనిస్థాన్ రైట్ ఆర్మ్ స్పిన్నర్ ముజిబుర్ రహమాన్ అతి చిన్న వయసులో(18 సంవత్సరాల 271 రోజులు) టీ20 లీగ్‌లో 100 వికెట్లు సాధించిన క్రికెటర్‌‌గా రికార్డు సృష్టించాడు. గతంలో రషీద్ ఖాన్(18 సంవత్సరాల 360 రోజులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. 21వ శతాబ్దంలో జన్మించి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్న ఏకైక మేల్ క్రికెటర్‌‌గా రికార్డు నెలకొల్పడమే కాకుండా అతి చిన్న వయసులో(16 సంవత్సరాల 325 రోజులు) వన్డేల్లో 5 వికెట్ల క్లబ్‌లో చేరిన క్రికెటర్‌‌గా నిలిచాడు.

 ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు

ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1 వరకు ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలను నిర్వహించనున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ర్టియల్ టెక్నాలజీ యూనివర్సిటీ తొలిసారిగా ఈ క్రీడలను నిర్వహిస్తోంది. సుమారు 100 యూనివర్సిటీల నుంచి 4వేల మంది అథ్లెట్లు మస్కల్ జయ్, బిజయ్ క్రీడలలో పాల్గొననున్నారు.

 చెస్‌ టోర్నీ విజేత మగేశ్​ చంద్రన్

ఇంగ్లాండ్‌లోని హేస్టింగ్స్ వేదికగా జరిగిన ‘హేస్టింగ్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ టైటిల్‌’ను తమిళనాడుకు చెందిన మగేశ్ చంద్రన్ పంచనాథన్ గెలుపొందాడు. 1895 నుంచి నిర్వహిస్తున్న ఈ టోర్నీలో 2479  ఫిడే రేటింగ్ పంచనాథన్ 7.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. ఇతను 2003లో ఆసియా జూనియర్ చాంపియన్ షిప్ టైటిల్ సాధించి 2006లో గ్రాండ్ మాస్టర్ నార్మ్ సాధించాడు.

63వ నేషనల్ షూటింగ్ చాంపియన్ షిప్

2019 డిసెంబర్ 7  నుంచి జనవరి 4 వరకు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో 63వ జాతీయ షూటింగ్ చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. 10 మీటర్ల ఎయిర్ రైపిల్ విభాగంలో జానా ఖైతా గోల్డ్ మెడల్ గెలవగా మనుబాకర్ నాలుగు స్వర్ణాలు సాధించింది. 25 మీటర్ల ఫైర్ పిస్టల్‌ లో అనీశ్ భన్వాలా  గోల్డ్, 10మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో సౌరభ్ చౌదరి గోల్డ్ సాధించారు .

బీసీసీఐ అవార్డులు

బోర్డ్ ఆఫ్​ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) 2018–19 ఏడాదికి ప్రకటించిన వార్షిక అవార్డులలో  పాలీ ఉమ్రిగర్, దిలీప్‌ సర్దేశాయ్‌  రెండు పురస్కారాల్ని క్రికెటర్ జస్‌ప్రిత్ బుమ్రా అందుకున్నాడు.  ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డు  పూనం యాదవ్‌కు లభించింది.  ఉత్తమ అంతర్జాతీయ ఆరంగ్రేటరీగా పురుషుల విభాగంలో  మయాంక్ అగర్వాల్, మహిళా విభాగంలో జులన్ గోస్వామి, అత్యధిక పరుగుల విభాగంలో చతేశ్వర్‌ పుజారా, స్మృతి మంధానకు అవార్డులు అభించాయి. సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి కృష్ణమాచారి శ్రీకాంత్, అంజుం చోప్రా ఎంపికయ్యారు. 

ఏటీపీ కప్ –2020

జనవరి 3నుంచి 12 వరకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ కేంద్రంగా జరిగిన ఏటీపీ( అసొసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్) కప్‌–2020 విజేతగా సెర్చియా నిలిచింది.  2–1 పాయింట్ల తేడాతో రఫెల్ నాదల్ (స్పెయిన్‌)టీమ్‌పై  నోవాక్ జకోవిచ్‌(సెర్బియ) టీమ్  విజయం సాధించింది.

ఒలంపిక్స్–2020 సెలక్షన్‌

2020–టోక్యో ఒలింపిక్స్ లో ఈక్వేస్ట్రియన్ (అశ్విక క్రీడలు) ఈవెంట్‌లో భారత హార్స్ రైడర్ ఫౌద్ మీర్జా అర్హత సాధించాడు.  ఈ క్రీడలో రెండు దశాబ్దాల తర్వాత ఒలంపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారుడిగా  ఫౌద్ ఘనత సాధించాడు. 2000లో చివరగా ఇంతియాజ్ అనిస్ ఇండియా తరుపున ప్రాతినిధ్యం వహించాడు.  ఫౌద్ మీర్జా 2018లో ఆసియా క్రీడల్లో సిల్వర్ మెడల్, 2019 అర్జున అవార్డును అందుకున్నాడు. 

తెలంగాణకు 4స్వర్ణాలు

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణా క్రీడాకారులు నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించారు. జనవరి 14న  జరిగిన పోటీల్ల  అండర్-21 బాలుర టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో సూరావజ్జుల స్నేహిత్ చాంపియన్‌గా నిలిచాడు.అండర్-21 బాలుర సైక్లింగ్ టైమ్ ట్రయల్ ఈవెంట్‌లో తనిష్క్ గౌడ్‌, అథ్లెటిక్స్‌లో అండర్-17 బాలికల 200 మీటర్లలో జీవంజి దీప్తి, అండర్-17 బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో అగసార నందిని బంగారు పతకాలు  సాధించారు.

స్పోర్స్ట్‌

హార్బర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ

జనవరి 18న  ఆస్ట్రేలియాలో జరిగిన హార్బర్ట్ అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో సానియామిర్జా(ఇండియా), నదియా కిచ్‌నోక్ (ఉక్రెయిన్) జోడి , చైనాకు చెందిన శౌలిపెంగ్, శౌలిజాంగ్ జోడిపై విజయం సాధించారు. ఇందులో భాగంగా 13, 580 డాలర్ల ప్రైజ్ మనీ అందుకున్నారు.

ఐసీసీ అవార్డ్స్–2019

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్– 2019 అవార్డులను జనవరి 15న ప్రకటించింది. క్రికెటర్ ఆఫ్ ది ఇయన్‌గా బెన్‌స్టోక్స్(ఇంగ్లాండ్), వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌‌గా రోహిత్‌శర్మ(ఇండియా), టెస్ట్ క్రికెటర్ ఆఫ్​ ది ఇయర్‌‌గా పాట్ కమిన్స్(ఆస్ట్రేలియా), టీ20 బెస్ట్ ఫర్ఫామెన్స్ గా దీపక్ చాహర్ (ఇండియా) ఎంపికయ్యారు. ఎమర్జింగ్ క్రికెటర్‌‌గా మర్నూస్ లాబ్ చేజ్‌( ఆస్ట్రేలియా), అసోసియేట్ క్రికెటర్‌‌గా కైల్ కొయెట్జర్ (స్కాట్లాండ్) ఎంపికయ్యారు. స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ్ విరాట్‌ కోహ్లికి, ఉత్తమ ఎంపైర్‌‌కు అందించే డేవిడ్ షెఫర్డ్ ట్రోఫీని రిచర్డ్ ఇల్లింగ్ వర్త్‌(ఇంగ్లాండ్‌)కు లభించింది. ఉత్తమ మహిళ క్రికెటర్‌‌గా ఎలైన్‌ ఫెర్రీ(ఆస్ట్రేలియా), మహిళ టీ20 క్రికెటర్‌‌గా అలిస్సా హేలి (ఆస్ట్రేలియా) ఎంపికయ్యారు.

 అక్లాండ్ క్లాసిక్ టోర్నీ

జనవరి 12న న్యూజిలాండ్‌లో జరిగిన అక్లాండ్ క్లాసిక్ టోర్నీ ఫైనల్లో సెరెనా విలియమ్స్ (యూఎస్‌ఏ),  జెస్సికాపై  గెలుపొంది టైటిల్ అందుకుంది. దీంతో 23 గ్రాండ్స్ స్లామ్స్ సాధించి విలియమ్స్  అగ్రగామిగా నిలిచింది. మూడేండ్ల విరామం  తర్వాత ఆమెకు ఇదే తొలి టైటిల్‌.

సీనియర్ క్రికెటర్ రిటైర్‌‌ మెంట్

ఆంధ్ర  రంజీజట్టు సీనియర్ బౌలర్ డేవిడ్ పైడికాల్వ విజయ్‌కుమార్ రిటైర్‌‌మెంట్ ప్రకటించారు. 71 రంజీ మ్యాచ్‌లు ఆడిన విజయ్‌ 248 వికెట్లు సాధించి(షాబుద్దిన్ 75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు)  రికార్డు నెలకొల్పాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌‌గా నిలిచాడు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!