Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్ ఎఫైర్స్​ స్పోర్ట్స్​ (మార్చి 2020)

కరెంట్ ఎఫైర్స్​ స్పోర్ట్స్​ (మార్చి 2020)

current-affairs-sports

Advertisement

స్పోర్ట్స్

మహిళల టీ20 రికార్డు

ప్రత్యక్ష, పరోక్షంగా వ్యూస్‌తో మహిళల టీ20 వరల్డ్‌కప్‌ అనేక రికార్డులను నెలకొల్పింది. 2018 మహిళల టీ20 వరల్డ్‌కప్‌ను 1.8 బిలియన్ నిమిషాలు వీక్షించగా 2020 వరల్డ్‌కప్‌ను 5.4 బిలియన్ నిమిషాలు వీక్షించారు. 2018 వరల్డ్‌కప్‌ను 36.9 మిలియన్ల మంది వీక్షించగా, 2020 వరల్డ్‌కప్‌ను 74.9 మిలియన్ల మంది వీక్షించడం రికార్డు సృష్టించింది. 2020 మార్చి 8న ఆస్ట్రేలియాలో జరిగిన ఫైనల్‌ను 88వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. మహిళల క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌కైనా అత్యధికంగా వీక్షించిన మ్యాచ్ ఇదే. ఈ ఫైనల్‌ను టెలివిజన్లలో 9.9 మిలియన్ల మంది చూశారు.

Advertisement

ఒలింపిక్స్ వాయిదా

కోవిడ్–19 వైరస్ వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా 2020లో టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ 2021 సంవత్సరానికి వాయిదాపడ్డాయి. కానీ వీటినే 2020 ఒలింపిక్స్‌గానే పరిగణించనున్నారు. ప్రారంభ షెడ్యూల్ ప్రకారం టోక్యో వేదికగా జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు, పారా ఒలింపిక్స్ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 6 వరకు నిర్వహించాలి. 1896 నుంచి నిర్వహిస్తున్న ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం ఇదే తొలిసారి.

పీకే బెనర్జీ మృతి

Advertisement

ఇండియన్ ఫుట్‌బాల్ దిగ్గజం పీకే బెనర్జీ మార్చి 20న కోల్‌కతాలో మృతి చెందారు. ఈయన 1960 రోమ్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత జట్టుకు నాయకత్వం వహించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించారు. 1962లో ఆసియా క్రీడల్లో గోల్డ్ సాధించిన ఇండియన్ టీమ్‌లో ఆయన సభ్యుడిగా ఉన్నారు.

మెక్సికన్ ఓపెన్ టెన్నిస్–2020

ఫిబ్రవరి 24 నుంచి 29 వరకు జరిగిన మెక్సికన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో స్పెయిన్  ఆటగాడు రఫెల్ నాదల్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో యూ.ఎస్‌.ఏ కు చెందిన టేలర్ హర్ర ప్రిట్జ్‌ పై విజయం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో అస్నీ ఫెర్నాండెజ్(కెనడా)ను ఓడించి హిథిర్ మిరియం వాట్సన్ విజేజతగా నిలిచింది.

Advertisement

ఖేలో ఇండియా విజేతగా  పంజాబ్‌ యూనివర్సిటీ

ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో పంజాబ్ యూనివర్సిటీ పతకాల పట్టికలో తొలిస్థానం(17–18–10)లో నిలిచింది.  సావిత్రిబాయి ఫూలే యూనివర్సిటీ (17–11–09) రెండో స్థానం సంపాదించింది.   ఒడిశాలో భువనేశ్వర్ కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్‌ టెక్నాలజీలో ఫిబ్రవరి 22న   ప్రారంభమైన  ఖేలో ఇండియా యూనివర్సిటీ క్రీడలు మార్చి 1న ముగిసాయి. వంద యూనివర్సిటీల నుంచి4వేల మంది అథ్లెట్లు 17 రకాల క్రీడల్లో పాల్గొన్నారు.

దుబాయ్ ఓపెన్ చాంపియన్‌గా జకోవిచ్‌

Advertisement

 ఫిబ్రవరి 29న ముగిసిన దుబాయ్ ఓపెన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో  సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ 6-3, 6-4 తో స్టెఫానో సిట్సిపాస్(గ్రీస్)పై విజయం సాధించాడు. దీంతో తన కెరీర్‌‌లో 79వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.  తాజా టైటిల్‌తో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.

ఆస్ట్రేలియాదే టీ20 టైటిల్

ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియా వేదికగా నిర్వహించిన మహిళల టీ20 వరల్డ్‌కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియాకు మహిళా టీ20లో ఇది ఓవరాల్‌గా 5వ ప్రపంచకప్‌. ఇప్పటివరకు 2010, 2012, 2014, 2018, 2020లలో చాంఫియన్‌గా నిలిచింది. మొత్తం 10 జట్లు పాల్గొన్న ఈ పోటీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా బెథ్ మూని(ఆస్ట్రేలియా), అత్యధిక వికెట్లు మెఘన్ స్కాట్(ఆస్ట్రేలియా), అత్యధిక పరుగులు బెథ్ మూని(259) నిలిచారు. 2022లో తదుపరి మహిళల టీ20 వరల్డ్‌కప్ దక్షిణాఫ్రికాలో జరగనుంది.

Advertisement

మెక్సికో టైటిల్ నాదల్‌దే

మార్చి 1న మెక్సికోలోని అకాపుల్కోలో జరిగిన ఫైనల్లో అమెరికా ప్లేయర్ టేలర్ ఫ్రిట్జ్‌ను ఓడించడం ద్వారా స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నడాల్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీ విజేతగా నిలిచాడు. మెక్సికో ఓపెన్ టైటిల్‌ను నడాల్ గెల్చుకోవడం ఇది మూడోసారి. ఇప్పటివరకు 2013, 2015 సంవత్సరాలలో టైటిల్‌ గెలిచాడు.

ఖేలో ఇండియా క్రీడలు

Advertisement

ఖేలో ఇండియా శీతాకాల క్రీడలు రెండో దశ మార్చి 7న జమ్మూ కాశ్మీర్‌‌లోని గుల్మార్గ్‌లో ప్రారంభమయ్యాయి. మార్చి 11 వరకు అల్ఫైన్ స్కీయింగ్, క్రాస్ కంట్రీ స్కీయింగ్, స్నో బోర్డింగ్, స్కో షూయింగ్‌లలో పోటీలు జరిగాయి. వీటిలో 450 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. తొలిదశ క్రీడలు ఫిబ్రవరి 25న లేహ్ లడఖ్ లో జరిగాయి. లడఖ్‌లో ఓపెన్ ఐస్ హాకీ చాంపియన్‌షిప్, ఫిగర్ స్కేటింగ్‌లలో పోటీలు జరిగాయి.

బీబీసీ స్పోర్ట్స్ అవార్డ్స్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ బ్రిటీష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) మహిళా క్రీడాకారులకు అవార్డులను ప్రకటించింది. 2020కి ప్రకటించిన పురస్కారాలలో స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌‌గా పీవీ సింధు ఎంపికైంది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు పీటీ ఉషకు లభించింది. ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఏకైక భారత మహిళ పీవీ సింధు కాగా, పయనీర్ ఎక్స్‌ప్రెస్‌గా పేరొందిన పీటీ ఉష 1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో నానో సెకండ్ల తేడాతో కాంస్యపతకం కోల్పోయింది.

Advertisement

సూపర్‌‌లీగ్ విజేత ఏటీకే

ఈ ఏడాది ఇండియన్ సూపర్‌‌లీగ్ విజేతగా అథ్లెటికో డి కోల్‌కతా నిలిచింది. మార్చి 14న గోవాలో జరిగిన ఫైనల్లో అథ్లెటికో డి కోల్‌కతా 3–1 తేడాతో చెన్నయిన్ ఎఫ్‌సీపై విజయం సాధించింది. దీంతో ఏటీకే ఇప్పటివరకు మూడుసార్లు లీగ్ గెలిచిన మొదటి జట్టుగా నిలిచింది. కోవిడ్–19 కారణంగా ప్రేక్షకులు లేకుండా ఫైనల్ నిర్వహించారు.

ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్

Advertisement

మార్చి 11 నుంచి 15 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా నిర్వహించిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ పురుషుల సింగిల్స్‌ను చైనీస్ తైపీకి చెందిన చేతీన్ చెన్‌ను ఓడించడం ద్వారా విక్టర్ అక్సెల్‌సన్(డెన్మార్క్‌) విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్‌ను చెన్‌ యిఫి(చైనా)ను ఓడించడం ద్వారా తైజుయింగ్(చైనీస్ తైపీ) విజేతగా నిలిచారు.

ఒమన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్

ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీటీఎఫ్) నిర్వహించిన ఒమన్ ఓపెన్–2020 పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను అచంట శరత్ కమల్ సాధించారు. ఫైనల్లో పోర్చుగల్‌కు చెందిన మార్కోస్ పైటాస్‌ను ఓడించిన శరత్ కమల్‌కు 2010 ఈజిప్టు ఓపెన్ తర్వాత ఇది రెండో విజయం. మొరాకో ఓపెన్(2011), ఇండియా ఓపెన్(2017)లలో ఫైనల్‌కు చేరారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

merupulu study and jobs group

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN CONSTITUTION

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!