ఇంటర్నేషనల్
దశాబ్దపు ఉత్తమ టీనేజర్
పాకిస్థాన్‌కు చెందిన బాలిక విద్యా ఉద్యమ నాయకురాలు మలాల యూసఫ్ జాయ్‌ను ఐక్యరాజ్యసమితి ఈ దశాబ్దపు ఉత్తమ టీనేజర్‌గా గుర్తించింది. 2014లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి లభించగా, 2017లో యూఎన్‌ఓ శాంతిదూతగా నియమించింది. ఇటీవల ‘వీ ఆర్ డిస్‌ప్లేస్డ్’ పుస్తకాన్ని రచించారు.
హాలెండ్ పేరు తొలగింపు
12 ప్రావిన్సులతో కూడిన నెదర్లాండ్ తమ దేశానికి పర్యాయపదంగా వాడుతున్న హాలెండ్ పేరును ఈ ఏడాది జనవరి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. నార్త్, సౌత్ హాలెండ్‌లు మాత్రమే హాలెండ్ కానీ 12 ప్రావిన్సులకు ఇది మరో పేరుగా మారడంతో దీనిని తొలగిస్తున్నట్లు ప్రధాని మార్క్‌రుట్టె ప్రకటించారు. ఇక నుంచి చిహ్నంలో ఆరెంజ్ తులిప్‌తో పాటు పీఎల్ అక్షరాలను ఉంటాయి.
ప్రపంచ ఇంటిధరల సూచీ
అంతర్జాతీయ స్థిరాస్తి వ్యాపార సంస్థ నైట్‌ఫ్రాంక్ సంస్థ జులై–సెప్టెంబర్ మూడో త్రైమాసికానికి ప్రపంచ ఇంటిధరల సూచీలో ఇండియా 47వ స్థానంలో నిలిచింది. ఇండియాలో ఇంటిధరల పెరుగుదల 0.6శాతం మాత్రమే ఉంది. అత్యధిక ధరల పెరుగుదలతో హంగేరి(15.4) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. లక్జెంబర్గ్(11.4), క్రొయేషియా(10.4)లు రెండు, మూడు స్థానాలలో ఉన్నాయి. 56 దేశాలలో ధరల పెరుగుదల సగటున 3.7శాతం లోపు ఉంది. ఇది గత 6 సంవత్సరాలలో అతి తక్కువ పెరుగుదల శాతం కావడం విశేషం.
సన్‌స్క్రీన్ లోషన్ నిషేధం
సముద్రాలలోని పగడపు దీవులకు హాని కలిగిస్తున్న సన్‌స్క్రీన్ లోషన్స్‌ను ఫసిఫిక్ దేశం పలావు నిషేధించింది. లోషన్‌లో ఉండే ఆక్సిబెంజోన్, ఆక్టినోగ్జేట్‌లు అతినీలలోహిత కిరణాలను గ్రహించి నీటికి మరింత ఆమ్లత్వాన్ని చేకూరుస్తున్నాయి. 2021 నుంచి హవేలి దేశం సైతం సన్‌స్క్రీన్ లోషన్స్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.
చైనా దిగుమతులపై నియంత్రణ
2020 మార్చి నుంచి అత్యంత ఆవశ్యకం కానీ 371 చైనా వస్తువుల దిగుమతుల విషయంలో కఠిన నిబంధనలు పాటించాలని కేంద్రం నిర్ణయించింది. బొమ్మలు, ప్లాస్టిక్, క్రీడా వస్తువులు, ఫర్నిచర్ లాంటి వస్తువుల దిగుమతులలో ఈ నిబంధనలు పాటించనుంది. ఏటా చైనా విదేశాలకు ఈ వస్తువులను ఎగుమతి చేస్తూ 4 ట్రిలియన్ డాలర్లను ఆర్జిస్తోంది.
దుబాయ్ గ్లోబ్ సాకర్ అవార్డ్స్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన 11వ దుబాయి గ్లోబ్ సాకర్ అవార్డులలో బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డును పోర్చుగల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డొ అందుకున్నారు. గత 9 సంవత్సరాలలో రొనాల్డొ ఈ అవార్డుకు ఎంపికవడం ఇది 6వసారి.
యూన్సివర్సిటీ ఛాన్సలర్‌గా హిల్లరీ
అమెరికాకు చెందిన హిల్లరీ క్లింటన్ బ్రిటన్‌కు చెందిన క్వీన్స్ యూనివర్సిటీకి మొదటి మహిళా ఛాన్సలర్‌గా నియమితులయ్యారు. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన క్లింటన్ 2018లో క్వీన్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
సులేమానీ హతం
యూఎస్ సైన్యం జరిపిన డ్రోన్ దాడుల్లో అల్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమాని చనిపోయారు. 62 ఏళ్ల జనరల్ సులేమానీ స్థానిక మిలిటెంట్ సంస్థలతో కలిసి బాగ్దాద్ ఎయిర్‌పోర్ట్‌లో కారులో వెళ్తున్నప్పుడు దాడులు జరిగాయి. సులేమానితోపాటు హషద్ అల్ షాబీ, పారామిలటరీ ఫోర్స్ డిప్యూటీ చీఫ్ అబూ మహదీ అల్ -ముహదిస్ కూడా హతమయ్యారు. 2019 ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ నిరసనకారులు చేసిన దాడులకు ప్రతీకారంగా అమెరికా ఈ చర్యలకు పాల్పడింది. ఖుద్స్ ఫోర్స్ కొత్త చీఫ్‌గా బ్రిగేడియర్ జనరల్ ఇస్మాయిల్ ఖానీ నియమితులయ్యారు.
7.5లక్షల రైఫిళ్ల కొనుగోలు
ఇండో రష్యా రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా 7.5 లక్షల AK–203 రైఫిళ్లను కొనుగోలు చేసేందుకు రష్యాతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో లక్ష రైఫిళ్లను నేరుగా రష్యా నుంచి కొనుగోలు చేయనుంది. మిగిలిన 6.5లక్షల రైఫిళ్లను ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా కోర్వా పట్టణంలో తయారు చేయనున్నారు. ఇందులో ఆర్డినెన్స్ డిఫెన్స్ ఫ్యాక్టరీకి 50.5 శాతం, రష్యాకు 49.5శాతం భాగస్వామ్యం ఉంది.
ఇంటర్నేషనల్
ముషారఫ్‌కు మరణశిక్ష రద్దు
పాకిస్థాన్ మాజీ ప్రెసిడెంట్ పర్వేజ్ ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇస్లామాబాద్ కోర్టు వెలువరించిన తీర్పును లాహోర్ హైకోర్టు కొట్టివేసింది. మరణ శిక్ష తీర్పును సవాలు చేస్తూ ముషారప్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం (జస్టిస్ సయ్యద్ మజహర్ అలీ అక్బర్ నఖ్వీ, జస్టిస్ మొహ్మద్ అమీర్ భట్టీ, జస్టిస్ చౌధరి మసూద్ జహంగీర్) ఈ నెల 13న తీర్పు ఇచ్చింది. ముషారఫ్‌పై దేశద్రోహం కేసు నమోదు, మరణ శిక్ష తీరపు చట్ట వ్యతిరేకమని తేల్చి చెప్పింది.
మాల్టా ప్రధానిగా రాబర్ట్ అబెలా
మాల్టాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో లేబర్ పార్టీకి చెందిన రాబర్ట్ అబెలా దేశ 14 వ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈయన తండ్రి జార్జి అబెలా గతంలో మాల్టా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల ఓ జర్నలిస్ట్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొని రాజీనామా చేసిన ప్రధాని జోసెఫ్ ముస్కోట్ స్థానంలో ఈ నియామకం జరిగింది.
ప్రపంచ బాలమేధావి అవార్డు–2020
ఆధ్యాత్మిక యోగాలో చేసిన కృషికి గాను బ్రిటిష్ ఇండియన్ ఈశ్వర శర్మను ప్రపంచ బాలమేధావి అవార్డు–2020కు ఎంపిక చేసింది. సుమారు 45దేశాల నుంచి 15వేల మంది అవార్డుకు సంబంధించిన పోటీల్లో పాల్గొన్నారు.
తైవాన్ అధ్యక్ష ఎన్నికలు
ఇటీవల జరిగిన తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లలో అధ్యక్షురాలిగా త్సాయ్–ఇంగ్–వెన్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. డెమెక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీకి చెందిన ఈమె 57.1 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి హన్–కువో–యు పై విజయం సాధించారు. తై–ఇంగ్–వెన్ తైవన్ 2016 నుంచి కొనసాగుతున్నారు.
ఒమన్‌కు కొత్త సుల్తాన్
ఒమన్ రాజుగా హయితమ్ బిన్ తారిఖ్ అల్ సయీద్ జనవరి 14న పదవి బాధ్యతలు చేపట్టారు. విజన్ 2040 కార్యక్రమానికి పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న హయితమ్ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్. 197 నుంచి ఒమన్ పాలకుడిగా కొనసాగుతున్న సుల్తాన్ కుబూస్ బిన్ సయిద్ – అల్ – సయిద్ ఇటీవల మరణించడంతో నూతన పాలకుడిని నియమించారు.
నంబర్‌వన్ సిటీగా మలప్పురం
ఎకనమిక్స్ ఇంటలిజెన్స్ యూనిట్ 2015–20 గణాంకాలు, ఐక్యరాజ్య సమితి నివేదికల ఆధారంగా వేగంగా ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న10 నగరాల జాబితాను తయారు చేశారు. ఇందులో ఇండియా నుంచి కేరళా రాష్ట్రం లోని మలప్పురం సిటీ మొదటి స్థానంలో నిలవగా , కోజికడ్ నాల్గో స్థానం, కోల్లాం పదో స్థానంలో నిలిచాయి. కనౌచ్ (వియాత్నం) రెండో స్థానం, సుథియాన్(చైనా) మూడో స్థానంలో నిలిచాయి.
పాస్‌పోర్ట్ ఇండెక్స్ –2020
హెన్రి సంస్థ రూపొందించిన పాస్‌పోర్ట్ ఇండెక్స్ –2020 లో జపాన్, సింగపూర్ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లలో నిలవగా జర్మనీ, దక్షిణ కొరియా సంయుక్తంగా థర్డ్ ప్లేస్‌లో నిలిచాయి. ఇందులో ఇండియా 84వ ర్యాంకు పొందింది. ఇప్పటి వరకు ఇండియా 58 దేశాలతో వీసా సౌకర్యాన్ని కలిగి ఉంది. అప్గనిస్థాన్, ఇరాక్, సిరియా, పాకిస్థాన్ చివరి నాలుగు ర్యాంకులు పొందాయి. ఇండియాతో పాటు మౌరిజానియ, తజకిస్థాన్, సంయుక్తంగా 84వ స్థానంలో నిలిచాయి.
జి77 అధ్యక్ష దేశంగా గయానా
జి77 కూటమి అధ్యక్ష స్థానానికి గయానా దేశం ఎంపికైంది. ఈ మేరకు జనవరి 15న పాలస్తీనా దేశం నుంచి బాధ్యతలు తీసుకుంది. ఆర్థికప రమైన సహకారంతో యూఎన్‌ఓలో బలోపేతం కావాలనే లక్ష్యంతో1964 జూన్ 15న జి77 దేశాలు కూటమికిగా ఏర్పడ్డాయి. ఇందులో 135 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ప్రధాన కార్యాలయం స్విట్జర్‌లాండ్‌లో ఉంది.
ఎస్400 మిసైల్ సిస్టమ్
ఢిల్లీ గగనతల రక్షణ కోసం ఉద్దేశించిన 5ఎస్400 మిసైల్ సిస్టమ్‌ను 2025వరకు ఇండియాకు అందజేస్తామని జనవరి 17న రష్యా ప్రకటించింది. 5.43 బిలియన్ డాలర్ల విలువైన ఈ ఒప్పందం 2018 లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన భారత్–రష్యా ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా కుదిరింది. దీంతో పాటు 60కేఏ–2267 రకానికి చెందిన 140 హెలికాప్టర్లు అందించబడతాయి.
ప్రపంచ నివాసయోగ్య నగరాల జాబితా
నైట్ ఫ్రాంక్ సంస్థ 150 నగరాలతో రూపొందించిన ప్రపంచ నివాసయోగ్య నగరాల జాబితా–2019 మూడో త్రైమాసికంలో హంగేరి రాజధాని బుడాపెస్ట్ కేవలం 24శాతం ధరల పెరుగుదలతో తొలిస్థానంలో నిలిచింది. చైనాలోని గ్జియాన్(15.9శాతం), వుహన్(14.9శాతం) వరసగా తరువాత స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో 9శాతం ఇండ్ల ధరల పెరుగుదలతో హైదరాబాద్ 14వ స్థానంలో నిలిచింది. న్యూఢిల్లీ 73వ, బెంగళూర్ 94, అహ్మదాబాద్ 108 ర్యాంకులలో నిలిచాయి.
సైన్స్ అండ్ టెక్నాలజీ
ఐ మొబైల్‌యాప్
ఐసీఐసీఐ(ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) బ్యాంకు కార్డు లెస్ క్యాష్ విత్‌డ్రా సౌకర్యం కోసం ఐ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 15వేల ఏటీఎం నుంచి రోజుకు గరిష్టంగా 20వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దేశంలో ఈ రకమైన విధానం ప్రవేశపెట్టిన మొదటి బ్యాంకు ఎస్‌బీఐ.
లివింగ్ రోబోలు
వారాల పాటు ఆహారం లేకుండా జీవించగలిగే తొలి లివింగ్ రోబోట్లను వెర్మెంట్ యూనివర్సిటీ, టఫ్ట్స్ యూనివర్సిటీ సైంటిస్టులు రూపొందించారు. మిల్లిమీటర్ పరిమాణం గల ఈ రోబోలను ఆఫ్రికా కప్ప గ్జెనోపస్ స్టెల్స్ నుంచి రూపొందించారు. మానవ ఆరోగ్య పరిశోధనల కోసం ఇవి ఉపయోగపడతాయి.
చికిత్సకు రూ.15లక్షలు
జీవితకాలం చికిత్స అవసరమయ్యే వ్యాధులకు రాష్ట్రీయ ఆరోగ్య నిధి పథకం కింద రూ. 15లక్షలు అందించాలని కేంద్రం నిర్ణయించింది. దారిద్ర్యరేఖకు దిగువన ఉండి హియోఫీలియా, థలసేమియా, సికిల్‌సెల్ ఎనిమియా, స్పైనల్ మాస్క్యూలర్ ఎట్రోఫి, గ్రేచర్ డిసీస్, జన్యులోపాలతో వచ్చే వ్యాధులకు ఈ స్కీం వర్తించనుంది. దీనిపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఫిబ్రవరి 10వరకు గడువు విధించింది.
జీశాట్–30
జనవరి 17న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జీశాట్–30 ఉపగ్రహాన్ని ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించింది. ఏరియన్-5 వాహకనౌక ద్వారా 38 నిమిషాల్లో ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఇది టెవివిజన్, ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
గోవాలో జనవరి 15 నుంచి 18 వరకు ఇండియా సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. యువతలో సైన్స్ పరిజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశంతో సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రమోద్ సావంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘మిలియన్ సోల్’ పేరుతో ఎల్‌ఈడీ బల్సుల తయారీ వర్క్ షాప్‌ను ఏఏటీ బాంబే నిర్వహించింది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
చినాబ్ బ్రిడ్జి నిర్మాణానికి లక్ష్యం
2021 డిసెంబర్ నాటికి చినాబ్ బ్రిడ్జి పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కశ్మీర్ ను మిగిలిన ప్రధాన భారత భూభాగంతో కలిపే ఈ బ్రిడ్జి చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తున్నారు. ఇది ఈఫీల్ టవర్ (324)కన్నా 30 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం చైనాలోని షుబ్ బై రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోని ఎత్తైన నదిగా కొనసాగుతోంది. చినాబ్ బ్రిడ్జి 1.315 కి.మీ పొడవులో ఉండి కత్రాలోని బక్కాల్, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతుంది.
గ్రీన్ క్రెడిట్ స్కీం
వాణిజ్య అవసరాల కోసం అడవులు కావాలనుకునే పరిశ్రమల కోసం కేంద్రం గ్రీన్ క్రెడిట్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా గ్రామ శాఖలు, ప్రైవేటు ఏజెన్సీలు ఖాళీగా ఉన్న అటవీ భూములలో మొక్కలు నాటుతారు. తర్వాత ప్రైవేటు కార్యకలాపాలకు అడవులు కావాలనుకున్న వారు ఏజెన్సీలు పెంచిన అడవులను డబ్బులు చెల్లించి వాటిని ప్రభుత్వానికి అప్పగించి అనుమతులు పొందుతారు.
అష్పఖుల్లాఖాన్ జూపార్క్
ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్ కేంద్రంగా 121 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్న అష్పఖుల్లాఖాన్ జూపార్క్‌కు ప్రభుత్వం రూ. 234 కోట్లను కేటాయించింది. ఈ పార్కును 2008–09లో ప్రతిపాదించారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌లో కీలక సభ్యుడిగా పనిచేసిన అష్పఖుల్లాఖాన్ పేరును ఈ పార్కుకు పెట్టారు. యూపీలో ఇప్పటికే నవాబ్ వాజిద్ ఆలీఫా జూపార్క్(లక్నో), కాన్ఫూర్ జూపార్క్‌లు ఉన్నాయి.
మిలాన్–2020
విశాఖపట్నం కేంద్రంగా మార్చి నెలలో మిలాన్ పేరుతో అంతర్జాతీయ నౌకా విన్యాలసాలను నిర్వహించనున్నారు. ‘ సీనర్జీ అక్రాస్ ది సీ’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. విదేశీ నౌక సంస్థలతో సంబంధాలు, నౌకయానం బలోపేతం దీని ప్రధాన ఉద్దేశం. ఇందులో 41 దేశాలు పాల్గొనున్నాయి.