HomeADMISSIONSసీటెట్ అప్లికేషన్లకు కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా ?

సీటెట్ అప్లికేషన్లకు కొన్ని రోజులే ఛాన్స్.. అప్లై చేశారా ?

కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు.. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)సెప్టెంబర్ 2026 నోటిఫికేషన్‌ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే దేశవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో 1నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షను సెప్టెంబర్ 6న ఆఫ్‌లైన్ విధానంలో దేశంలోని 132 నగరాల్లో, 27 భాషల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు బోధించడానికి అర్హత సాధించవచ్చు.

ముఖ్యమైన తేదీలు,పరీక్షా విధానం:
ఈ పరీక్షకు హాజరుకావాలనుకునే.. అభ్యర్థులు జూన్ 10 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు జరిగితే, వాటిని సరిచేసుకోవడానికి జూన్ 15 నుంచి 18 వరకు కరెక్షన్ విండో అందుబాటులో ఉంటుంది. ఇక పరీక్షను సెప్టెంబర్ 6 (ఆదివారం) నాడు ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే.. సెప్టెంబర్ 5న కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.

పేపర్ల వివరాలు.. అర్హత మార్కులు:
సీటెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునే వారు పేపర్-I, 6 నుంచి 8 తరగతుల కోసం పేపర్-II రాయాలి. రెండు స్థాయిలకూ అర్హత ఉన్నవారు రెండు పేపర్లకూ హాజరుకావచ్చు. ఒక్కో పేపర్‌లో 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 2 గంటల 30 నిమిషాల సమయం ఇస్తారు. ఇందులో ఎలాంటి నెగటివ్ మార్కింగ్ లేదు. జనరల్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ,దివ్యాంగులకు నిబంధనల ప్రకారం 5% సడలింపు ఉంటుంది. ఒక్కసారి ఈ పరీక్షలో క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్‌కు రూ.1000, రెండు పేపర్లకు కలిపి రూ. 1200 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఒక పేపర్‌కు రూ.500, రెండు పేపర్లకు రూ. 600 గా నిర్ణయించారు.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ ఫోటో, సంతకం స్కాన్ కాపీలను అప్‌లోడ్ చేసి, నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ద్వారా ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here