సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(CTET-2025) నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర విద్యా సంస్థల్లో బోధించడానికి సీటెట్ అర్హత తప్పనిసరి. ప్రైమరీ, ఎలిమెంటరీ టీచర్లకు వేర్వేరుగా సీటెట్ పరీక్ష నిర్వహిస్తారు.
సీటెట్ –2025 నోటిఫికేషన్ ద్వారా 2026 ఫిబ్రవరి 8న పరీక్ష నిర్వహించేందుకు సీబీఎస్ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 20 భాషల్లో దేశవ్యాప్తంగా 132 నగరాల్లో సీటెట్ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతియేటా సీటెట్ పరీక్ష జూలై, డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. కానీ చివరిసారిగా 2024 సెప్టెంబర్ నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ 14న పరీక్ష పెట్టారు. మళ్లీ 2025 జూలై నోటిఫికేషన్ ఇవ్వలేదు.
ఏడాది తర్వాత సీటెట్ నోటిఫికేషన్ వచ్చింది. కేంద్ర పరిధిలోని విద్యాలయాల్లో నవోదయ, ఏకలవ్య, సైనిక్, కేంద్రీయ విద్యాలయాలల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్లు రావడంతో సీటెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అక్టోబర్ 24 న నోటిఫికేషన్ ఇచ్చింది.





