సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. సీటెట్ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా డిసెంబర్-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్లికేషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 1న పరీక్ష నిర్వహించనున్నారు.
అర్హతలు: పన్నెండో తరగతి, డిగ్రీ, డీఈఎల్ఈడీ/ డీఈడీ (ప్రత్యేక విద్య), బీఈడీ, బీఈడీ(ప్రత్యేక విద్య), బీఈఎల్ఈడీ/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: పరీక్ష మొత్తం రెండు పేపర్లు ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ) చెల్లించాలి. డిసెంబర్ 1న పరీక్ష నిర్వహిస్తారు. జనవరిలో ఫలితాలు విడుదల చేస్తారు. పూర్తి వివరాలకు www.ctet.nic.in వెబ్సైట్లో సంప్రదించాలి.