సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 27 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 18 వరకు అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 8న పరీక్ష ఓఎమ్మార్ విధానంలో(ఆఫ్లైన్)లో నిర్వహిస్తారు.
అర్హతలు
ఇంటర్మీడియేట్తో పాటు డీఈఎల్ఈడీ/బీఈఎల్ఈడీ: డిగ్రీ , డీఈడీ(ప్రత్యేక విద్య), బీఈడీ , స్పెషల్ బీఈడీ, బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
అప్లికేషన్ ప్రాసెస్
దరఖాస్తులు నవంబర్ 27 నుంచి ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 18వరకు గడువు ఇచ్చారు. పరీక్ష ఫిబ్రవరి 08న నిర్వహిస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీలకు రూ.100, రెండు పేపర్లు రాస్తే రూ.1200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు పేపర్ 1 రూ.500, రెండు పేపర్లకు రూ.600 చెల్లించాలి.
పరీక్షా విధానం
1నుంచి 5వ తరగతులకు బోధించాలనుకుంటే పేపర్–1, 6 నుంచి 8వతరగతి బోధించే వారు పేపర్–2 రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఉత్తీర్ణత సాధిస్తే.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని కేవీఎస్, నవోదయ, సైనిక్ స్కూల్, అన్ని కేంద్ర ప్రభుత్వ పరిధిలోని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు రాసేందుకు అర్హత కలిగి ఉంటారు.





