HomeJOBSటెట్​ మిస్సయిందా.. సీ టెట్​ 2026 అప్లై చేయండి

టెట్​ మిస్సయిందా.. సీ టెట్​ 2026 అప్లై చేయండి

మే 11 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు
జూన్‌ 10 చివరి తేదీ
సెప్టెంబర్‌ 6న సీటెట్‌ పరీక్ష
దేశవ్యాప్తంగా 132 నగరాల్లో పరీక్ష

తెలంగాణ టెట్​ (TG TET) రాయలేకపోయారా.. మంచి స్కోర్​ తెచ్చుకోలేకపోయారా.. అయినా సరే.. టీచర్​ కావాలనే మీ డ్రీమ్​ నెరవేరాలంటే.. మరో ఛాన్స్​ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET-2026) నోటిఫికేషన్ విడుదలైంది. మే 11 నుంచి అప్లికేషన్లు మొదలయ్యాయి. జూన్​ 10వ తేదీ వరకు అప్లై చేసుకునే ఛాన్స్​ ఉంది. సెప్టెంబర్​ 6 సీటెట్​ పరీక్ష నిర్వహిస్తారు. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో సీబీఎస్​ఈ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి నిర్వహించే సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌-సీటెట్‌ 22వ ఎడిషన్‌కు నోటిఫికేషన్‌ విడుదలైంది. సెప్టెంబర్‌ 6న సీటెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు సీబీఎస్‌ఈ ప్రకటించింది. పేపర్‌-1, పేపర్‌-2 పరీక్షలు అదే రోజు జరుగుతాయి. ఈ మేరకు సీటెట్‌ యూనిట్‌ మే 8న పబ్లిక్‌ నోటీస్‌ జారీ చేసింది.

సీటెట్‌ సెప్టెంబర్‌ 2026 పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు జూన్‌ 10 రాత్రి 11.59 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును డెబిట్‌ కార్డు, క్రెడిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా జూన్‌ 10 రాత్రి 11.59 గంటలలోపు చెల్లించాలి.

దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే జూన్‌ 15 నుంచి 18 వరకు ఆన్‌లైన్‌లో సవరణలు చేసుకునే అవకాశం కల్పించారు. ఆ గడువు తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ సవరణలకు అనుమతి ఉండదని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. పరీక్షకు రెండు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు అందుబాటులోకి వస్తాయి.

సీటెట్‌ పరీక్షను దేశవ్యాప్తంగా 132 నగరాల్లో నిర్వహిస్తారు. మొత్తం 27 భాషల్లో పరీక్ష జరుగుతుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే సెప్టెంబర్‌ 5న కూడా పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని నోటీసులో తెలిపారు.

ఈసారి ఆన్‌లైన్‌ దరఖాస్తు సమయంలో పరీక్ష నగరాన్ని ఎంచుకునే అవకాశం ఉండదు. అభ్యర్థులకు పరీక్ష నగరాన్ని సీబీఎస్‌ఈ రాండమ్‌ పద్ధతిలో కేటాయిస్తుంది. కేటాయించిన పరీక్ష నగరాన్ని మార్చాలన్న అభ్యర్థనలను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని సీబీఎస్‌ఈ వెల్లడించింది.

పరీక్ష విధానం, సిలబస్‌, భాషలు, అర్హత ప్రమాణాలు, పరీక్ష ఫీజు, పరీక్ష నగరాలు, ముఖ్యమైన తేదీలతో కూడిన వివరణాత్మక ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌ను త్వరలో అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు బులెటిన్‌ను జాగ్రత్తగా చదవాలని సూచించారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సీటెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://ctet.nic.in లేదా సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌ https://www.cbse.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఫలితాలను అక్టోబర్‌ 2026 చివరి నాటికి ప్రకటించే అవకాశం ఉంది.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here