HomeJOBSసీటెట్ అప్లికేషన్లకు మరో అవకాశం..సెప్టెంబర్ 1 చివరి తేదీ

సీటెట్ అప్లికేషన్లకు మరో అవకాశం..సెప్టెంబర్ 1 చివరి తేదీ

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది! వివిధ కారణాల వల్ల గతంలో సెంట్రల్ టెట్ (CTET) అప్లికేషన్ మిస్ చేసుకున్న అభ్యర్థుల కోసం సీబీఎస్ఈ మరోసారి అప్లికేషన్ విండోను ఓపెన్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇచ్చిన ఈ తాజా అవకాశం ఉపాధ్యాయ అభ్యర్థులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత సాధించాలంటే ‘సీటెట్’ అర్హత తప్పనిసరి. కాగా గతంలో వేర్వేరు కారణాల వల్ల అప్లై చేసుకోలేకపోయిన అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు కూడా రావడంతో, సీబీఎస్ఈ వారికి మరోసారి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

అప్లికేషన్ వివరాలు:
సీటెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ పోర్టల్ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబర్ 1 వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదివరకే (మే 11 నుంచి జూన్ 10 మధ్యకాలంలో)అప్లై చేసుకున్న అభ్యర్థులు మళ్లీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అయితే.. గతంలో అప్లై చేసినప్పుడు అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే, వాటిని ఎడిట్ చేసుకోవడానికి మాత్రం ఇప్పుడు అవకాశం ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పు :
ఉపాధ్యాయ అర్హత పరీక్ష అర్హతను సాధించాలని ఆకాంక్షించే మరింత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పులో పేర్కొన్న అంశాలను దృష్టిలో ఉంచుకుని సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ఈ అప్లికేషన్ గడువు ముగిసిన తర్వాత, 22వ ఎడిషన్ పరీక్ష నిర్వహించే తేదీలను సీబీఎస్ఈ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

ఎలా అప్లై చేయాలి ?

  1. ముందుగా సీటెట్ అధికారిక వెబ్‌సైట్ ctet.nic.in ని ఓపెన్ చేయాలి.
  2. హోమ్‌పేజీలో కనిపించే “Apply for CTET 2026” లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత “New Registration” పై క్లిక్ చేసి, మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ వంటి వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తికాగానే మీ ఫోన్‌కు లేదా ఈమెయిల్‌కు అప్లికేషన్ నంబర్ వస్తుంది.
  3. తర్వాత మీకు వచ్చిన అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. మీ వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు, పరీక్ష రాయాలనుకునే లాంగ్వేజ్‌లు, పరీక్షా కేంద్రం ఆప్షన్లను జాగ్రత్తగా ఫిల్ చేయాలి.
  4. అనంతరం మీ లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, మీ సంతకాన్ని అవసరం అయిన సైజులో స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
  5. మీ కేటగిరి (General/OBC/SC/ST), పేపర్ల సంఖ్య (Paper 1 లేదా Paper 2 లేదా రెండూ) ఆధారంగా ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  6. చివరగా.. ఫీజు పేమెంట్ పూర్తయిన తర్వాత స్క్రీన్ మీద కనిపించే కన్ఫర్మేషన్ పేజీని లేదా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ప్రింటవుట్ తీసుకోండి.
RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here