తెలంగాణ టెట్ (TS TET) రాయలేకపోయారా.. మంచి స్కోర్ తెచ్చుకోలేకపోయారా.. అయినా సరే.. టీచర్ కావాలనే మీ డ్రీమ్ నెరవేరాలంటే.. మరో ఛాన్స్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET-2022) నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 31 నుంచే అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అప్లై చేసుకునేందుకు నవంబర్ 24వ తేదీ వరకే గడువుంది. మరో పది రోజుల గడువు మాత్రమే మిగిలింది. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న వారు తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకునేందుకు ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో సీబీఎస్ఈ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31 వ తేదీ నుంచి నవంబర్ 24 వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లికేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సీటెట్ ఆన్ లైన్ టెస్ట్ ను డిసెంబర్, జనవరిలో నిర్వహించనున్నట్లు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది.
CTET సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. ఇది రెండు లెవెల్స్ లో జరుగుతుంది. 1 నుంచి 5 తరగతి వరకు టీచింగ్ చెప్పాలనుకునే వారు పేపర్ 1కు హాజరు కావాలి. అదే 6 నుంచి 8వ తరగతులకు వరకు భోదించాలనుకుంటే పేపర్ 2కు హాజరుకావాలి.
గతంలో సీ-టెట్ ఏడేళ్ల వరకు వ్యాలిడిటీలో ఉండేది. ఆ తరు వాత అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయాల్సి ఉండేది. అయితే ప్రస్తుతం CTET సర్టిఫికేట్ జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం ఎవరైనా ఎన్నిసార్లైనా పరీక్ష రాయడానికి అవకాశం ఉంది. వయోపరిమితి కూడా లేదు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో బోధించడానికి అర్హులుగా పరిగణిస్తారు.
అర్హతలు: C-TET 2022కు దరఖాస్తు చేయాలంటే.. ఇంటర్లో కనీసం 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
6వ తరగతి నుంచి 9 తరగతుల వరకు బోధించాలనుకునే వారు డిగ్రీతో పాటు ప్రాథమిక విద్యలో రెండేళ్ల డిప్లొమా లేదా ఒక సంవత్సరం BEd లేదా నాలుగు సంవత్సరాల BElEdలో ఉత్తీర్ణులై ఉండాలి. KVS, NVS, సెంట్రల్ టిబెటన్ పాఠశాలలు వంటి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో దరఖాస్తు చేయడానికి C-TET స్కోర్ ఉపయోగపడనుంది.
అప్లై చేసేందుకు డైరెక్ట్ లింక్ https://ctet.nic.in/
STRUCTURE AND CONTENT OF CTET
All questions in CTET will be Multiple Choice Questions (MCQs), with four alternatives out of which one answer will be most appropriate. Each carrying one mark and there will be no negative marking.
There will be two papers of CTET.
- Paper I will be for a person who intends to be a teacher for classes I to V.
- Paper II will be for a person who intends to be a teacher for classes VI to VIII.
Note: A person who intends to be a teacher for both levels (classes I to V and classes VI to VIII) will have to appear in both the papers (Paper I and Paper II).
Paper I (for Classes I to V) Primary Stage; Duration of Exam 2.30 Hrs
(i) Child Development and Pedagogy (compulsory) | 30 MCQs | Marks |
(ii) Language I (compulsory) | 30 MCQs | 30 Marks |
(iii) Language II (compulsory) | 30 MCQs | 30 Marks |
(iv) Mathematics | 30 MCQs | 30 Marks |
(v) Environmental Studies | 30 MCQs | 30 Marks |
Total | 150 MCQs | 150 Marks |
Paper II (for Classes VI to VIII) Elementary Stage : Duration 2.30 Hrs
(i) Child Development & Pedagogy(compulsory) | 30 MCQs | 30 Marks |
(ii) Language I (compulsory) | 30 MCQs | 30 Marks |
(iii) Language II (compulsory) | 30 MCQs | 30 Marks |
(iv) Mathematics and Science | 60 MCQs | 60 Marks |
(for Mathematics and Science teacher) | ||
OR (v) Social Studies/Social Science | 60 MCQs | 60 Marks |
(for Social Studies/Social Science teacher) | ||
*For any other teacher – either (IV) or (V) Total | 150 MCQs | 150 Marks |
Sir i am B.tech nenu apply cheyacha CTET ?
Telangana lo seat vacant ledhu… Hyderabad exam centre kavali.