HomeCAREERసీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్

సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ అడ్మిట్ కార్డులు విడుదల.. డైరెక్ట్ లింక్

జాయింట్‌ సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్‌ డిసెంబర్‌ 2025 సెషన్‌ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు వెంటనే అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్‌ను ఉపయోగించి అడ్మిట్ కార్డులను పొందవచ్చు.

పరీక్ష తేదీ, సమయం: ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) డిసెంబర్ 18, 2025న జరగనుంది. పరీక్షలను రెండు షిఫ్టులలో నిర్వహించనున్నారు.

షిఫ్ట్-1 (ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు): లైఫ్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్ పేపర్లు జరుగుతాయి.

షిఫ్ట్-2 (మధ్యాహ్నం 3:00 నుంచి సాయంత్రం 6:00 వరకు): కెమికల్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్ పేపర్లు ఉంటాయి.

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ విధానం:

  1. అభ్యర్థులు ముందుగా, csirnet.nta.nic.in అనే అధికారిక NTA వెబ్‌సైట్‌ లోకి లాగిన్ అవ్వాలి.

2. తర్వాత హోమ్ పేజీలో కనిపించే ‘CSIR UGC NET అడ్మిట్ కార్డ్ 2025’ లింక్‌పై క్లిక్ చేయండి.

3. లాగిన్ పేజీలో.. మీ అప్లికేషన్ నెంబర్ , పుట్టిన తేదీ (లేదా పాస్‌వర్డ్) ఎంటర్ చేయండి.

4. తర్వాత సెక్యూరిటీ పిన్‌ను ఎంటర్ చేసి, ‘సబ్మిట్’పై క్లిక్ చేయండి.

5. వెంటనే మీ అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోండి.

ఈ పరీక్ష సైన్స్ విభాగాల్లో పరిశోధనల కోసం జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) అర్హతను కల్పిస్తుంది. జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు CSIR పరిధిలోని ప్రముఖ రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ (Ph.D.) అడ్మిషన్లకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా.. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే.. వివిధ యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులవుతారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here