హైదరాబాద్‌లోని ప్రముఖ పరిశోధనా సంస్థ అయిన ‘సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ’ (CSIR-CCMB) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ వంటి మొత్తం 80 పోస్టులను ఈనోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. సైన్స్ , టెక్నాలజీ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఇది ఒక సువర్ణావకాశం. అర్హత గల అభ్యర్థులు జనవరి 27 నుంచి ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం: 80 పోస్టులు
టెక్నీషియన్ (I): 50 పోస్టులు
టెక్నికల్ అసిస్టెంట్: 25 పోస్టులు
టెక్నికల్ ఆఫీసర్: 05 పోస్టులు
అసిస్టెంట్ ప్రొఫెసర్ (క్లినికల్, నాన్-క్లినికల్): సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ (MD/MS/DNB) కలిగి ఉండాలి. ఈ డిగ్రీని తప్పనిసరిగా MCI/NMC చే గుర్తింపు పొందిన సంస్థ నుంచి పొంది ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెసర్ (సూపర్ స్పెషాలిటీ): సంబంధిత సూపర్ స్పెషాలిటీలో పీజీ డిగ్రీ (DNB/DrNB/DM/MCh) కలిగి ఉండాలి. ఇది కూడా MCI/NMC గుర్తింపు పొందిన సంస్థ నుంచే ఉండాలి.
సీనియర్ రెసిడెన్సీ (SR) నిబంధనలు:
క్లినికల్, నాన్-క్లినికల్: అభ్యర్థులు తమ పీజీ పూర్తి చేసిన తర్వాత, గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఒక సంవత్సరం సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసి ఉండాలి.
సూపర్ స్పెషాలిటీ: సూపర్ స్పెషాలిటీ పోస్టులకు అప్లై చేసే వారికి సీనియర్ రెసిడెన్సీ అవసరం లేదు.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు హోదాను బట్టి జీతం ఉంటుంది.
టెక్నీషియన్ పోస్టులకు నెలకు సుమారు రూ. 39,545 జీతం ఉంటుంది.
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు నెలకు సుమారు రూ. 72,240 జీతం ఉంటుంది.
టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు సుమారు రూ. 90,100 జీతం ఉంటుంది.
వయస్సు (23-02-2026 నాటికి):
టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ట వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు 30 ఏళ్ల వరకు అవకాశం ఉంది. (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు వయో సడలింపు ఉంటుంది).
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: జనవరి 27 నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చ.
ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: ఫిబ్రవరి 23 వరకు అప్లైచేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
అప్లికేష్ విధానం:
అర్హత గల అభ్యర్థులు CCMB అధికారిక వెబ్‌సైట్ ccmb.res.in సందర్శించి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, అప్లికేషన్ ఫారమ్ యొక్క హార్డ్ కాపీని అవసరమైన డాక్యుమెంట్లతో జతచేసి నిర్ణీత గడువులోగా హైదరాబద్ లోని ఆఫీసుకు పంపాల్సి ఉంటుంది.





