పోలీస్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సెంట్రల్ హోం మినిస్ట్రీ పరిధిలోని సీఆర్పీఎఫ్ (CRPF). భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9212 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సంస్థ. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి.
అధికారిక వెబ్ సైట్–https://crpf.gov.in/
మొత్తం కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) ఖాళీలు: 9,212
పురుషులు: 9105
మహిళలు: 107
విద్యార్హత: టెన్త్, ఐటీఐ విద్యార్మత కలిగిన పురుషులు/ మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25 వరకు అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700-రూ.69,100 వేతనం ఉంటుంది.