కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్.. కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 9195 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ (ITI) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మే 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకునే అవకాశం కల్పించారు. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
CRPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2026– పూర్తి వివరాలు
పోస్టుల వివరాలు:
మొత్తం 9195 పోస్టులలో ఏపీలో 507 ఖాళీలు ఉంటాయి. డ్రైవర్, మోటార్ మెకానిక్, కార్పెంటర్, టెయిలర్, కుక్, సఫాయి కర్మచారి వంటి అనేక ట్రేడులలో ఈ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కొన్ని టెక్నికల్ పోస్టులకు ఐటీఐ తప్పనిసరి.
వయోపరిమితి: డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్లు, ఇతర ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
అభ్యర్థులను మొత్తం 5 దశల్లో ఎంపిక చేస్తారు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT): 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇందులో రీజనింగ్, జీకే, మ్యాథ్స్, ఇంగ్లీష్/హిందీ అంశాలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగటివ్ మార్కింగ్ ఉంది.
శారీరక పరీక్షలు (PET & PST): ఎత్తు, ఛాతి కొలతలు,రన్నింగ్ టెస్ట్ వంటివి నిర్వహిస్తారు.
ట్రేడ్ టెస్ట్: అభ్యర్థి ఎంచుకున్న వృత్తిలో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్: ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలిస్తారు.
మెడికల్ టెస్ట్: చివరగా మెడికల్ ఫిట్‌నెస్ పరీక్ష ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుష అభ్యర్థులకు రూ.100. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం:
అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.





