నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9195 కానిస్టేబుల్ (టెక్నికల్ & ట్రేడ్స్‌మెన్) పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్ లేదా ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్, కుక్, మోటార్ మెకానిక్ వంటి అనేక విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం పోస్టులు: 9195
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ అప్లికేషన్లు ప్రారంభం: ఏప్రిల్ 20వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
చివరి తేదీ: మే 19 వరకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు (01-01-2026 నాటికి):
డ్రైవర్ పోస్టులకు: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇతర ట్రేడ్స్‌మెన్ పోస్టులకు: 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. SC, ST, OBC అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం టెన్త్ పాసై ఉండాలి.
డ్రైవర్ పోస్టులు:టెన్త్‌తో పాటు హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులు: టెన్త్ + ఐటీఐ (మెకానిక్ మోటార్ వెహికల్) సర్టిఫికేట్ కలిగి ఉన్న వారు అర్హులు.
ఇతర పోస్టులు: సంబంధిత ట్రేడ్‌లో అనుభవం ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులను ఆరు దశల్లో ఎంపిక చేస్తారు.
1.CBT (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్): 100 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ (0.25) ఉంటుంది.
2.PST (ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్): ఎత్తు, ఛాతి కొలతలు చూస్తారు. (పురుషులు: 170 సెం.మీ, మహిళలు: 157 సెం.మీ).
3.PET (ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్): నిర్దేశించిన సమయంలో రన్నింగ్ టెస్ట్ పూర్తి చేయాలి.
4.ట్రేడ్ టెస్ట్: మీరు ఎంచుకున్న పనిలో మీకు ఉన్న నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్-3 ప్రకారం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం ఉంటుంది. వీటితో పాటు ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎలా అప్లై చేయాలి?
అర్హత కలిగిన అభ్యర్థులు CRPF అధికారిక వెబ్‌సైట్ rect.crpf.gov.in ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఫోటో, సంతకం , అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.





