HomeJOBSస్పోర్ట్స్ కోటా ద్వారా..521 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్!

స్పోర్ట్స్ కోటా ద్వారా..521 కానిస్టేబుల్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్!

కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు.. చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)మెరిటోరియస్ స్పోర్ట్స్‌పర్సన్స్ కోసం ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. స్పోర్ట్స్ కోటా కింద మొత్తం 521 హెడ్ కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ), కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేయనున్నారు. 22 క్రీడా విభాగాల్లో ప్రతిభ చూపిన మహిళలు, పురుషులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టుల వివరాలు, జీతం:
ఈ నోటిఫికేషన్ ద్వారా.. మొత్తం 521 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అందులో 182 హెడ్ కానిస్టేబుల్ (HC/GD) పోస్టులు, 339 కానిస్టేబుల్ (CT/GD) పోస్టులు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు.. ఎంపికైన వారికి పే లెవెల్-4 ప్రకారం రూ.25,500 నుంచి రూ. 81,100 వరకు, కానిస్టేబుల్ పోస్టులకు పే లెవెల్-3 ప్రకారం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు నెలవారీ వేతనం లభిస్తుంది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు ఉంటాయి.

విభాగాలు :
స్విమ్మింగ్/డైవింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్‌ బాల్, బాడీ బిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌ బాల్, హాకీ, జూడో, కబడ్డీ, కరాటే, షూటింగ్, తైక్వాండో, వాలీబాల్, వాటర్ స్పోర్ట్స్, వెయిట్‌ లిఫ్టింగ్, వుషు, రెజ్లింగ్, యోగా వంటి 22 క్రీడల్లో ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు:

హెడ్ కానిస్టేబుల్ (HC/GD): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 ఉత్తీర్ణులై ఉండాలి.

కానిస్టేబుల్ (CT/GD): గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

క్రీడార్హత: 30 సెప్టెంబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2026 మధ్య కాలంలో అంతర్జాతీయ, జాతీయ, ఖేలో ఇండియా, లేదా ఇంటర్-యూనివర్సిటీ పోటీల్లో పాల్గొని పతకాలు లేదా స్థానాలు సాధించిన క్రీడాకారులు అర్హులు.

వయోపరిమితి:
అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి (అభ్యర్థులు 2 ఆగస్టు 2003, 1 ఆగస్టు 2008 మధ్య జన్మించి ఉండాలి).

వయోపరిమితి సడలింపు: జనరల్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 8 సంవత్సరాలు, ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోసడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ:

ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

స్పోర్ట్స్ విజయాల ఆధారంగా మార్కుల కేటాయింపు

ఫిజికల్ టెస్ట్

స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్

మెడికల్ టెస్ట్

అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేసుకోవాలి. పురుషుల కేటగిరీ అభ్యర్థులు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: అభ్యర్థులు అక్టోబర్ 12 నుంచి అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: నవంబర్ 11 (రాత్రి 11:59) వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here