సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CPRI) దేశ వ్యాప్తంగా వివిధ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందులో ఇంజనీరింగ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ , ఎంటీఎస్ వంటి మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బెంగళూరు ప్రధాన కార్యాలయంతో పాటు భోపాల్, హైదరాబాద్, నాగ్‌పూర్, నోయిడా, కోల్‌కతా వంటి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యూనిట్లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. ఇదిలా ఉంటే పోస్టును బట్టి విద్యార్హతలు నిర్ణియించారు. అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయింది కాబట్టి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 19 నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
చివరి తేదీ: అక్టోబర్ 12 సాయంత్రం 5గంటల వరకు అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు :
ఈ నోటిఫికేషన్లో వివిధ రకాల పోస్టులకు వేర్వేరు అర్హతలు నిర్ణయించారు.
ఇంజనీరింగ్ ఆఫీసర్ (గ్రేడ్-1): ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీతో పాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
ఇంజనీరింగ్ అసిస్టెంట్ / సైంటిఫిక్ అసిస్టెంట్: సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా లేదా సైన్స్‌లో డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.
టెక్నీషియన్ & టెక్నికల్ అసిస్టెంట్:టెన్త్ అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి.
అసిస్టెంట్ గ్రేడ్-II: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ తప్పనిసరి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: టెన్త్ ఉత్తీర్ణులై ఉండాలి (ఈ పోస్టులన్నీ మాజీ సైనికుల కోసం రిజర్వ్ చేసారు).
జీతం,ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7వ వేతన సంఘం నిబంధనల ప్రకారం జీతం లభిస్తుంది. పోస్టును బట్టి లెవెల్-1 నుంచి లెవెల్-7 వరకు పే-స్కేల్ ఉంటుంది. ఇంజనీరింగ్ ఆఫీసర్ పోస్టులకు గేట్ స్కోర్ ఆధారంగా, మిగిలిన పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ , ట్రేడ్/ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు కేవలం ఆన్ లైన్ ద్వారా మాత్రమే అధికారిక వెబ్సైట్ (cpri.res.in) ద్వారా అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మాజీ సైనికులు ,మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. మిగిలిన అభ్యర్థులు పోస్టును బట్టి నిర్ణయించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ cpri.res.in సంప్రదించవచ్చు.





