రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రవేశ పరీక్ష(టీఎస్ సీపీజీఈటీ) జరగనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, మహిళా విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని 297 పీజీ కళాశాలల్లో 51 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీజెట్ నిర్వహిస్తున్నారు.
కోర్సులు: పీజీలో ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, ఎంకాం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంఎల్‌ఐబీఎస్సీ, బీఎల్‌ఐబీఎస్సీ ఉన్నాయి. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులో బయో-టెక్నాలజీ, కెమిస్ట్రీ/ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఐఎంబీఏ ఉన్నాయి. పీజీ డిప్లొమాలో చైల్డ్ సైకాలజీ, ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సెలింగ్, ఫోరెన్సిక్ సైన్స్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: పీజీ కోర్సులకు డిగ్రీ కోర్సులో కనీసం 40 శాతం మార్కులు; బీఎడ్/ బీపీఎడ్ కోర్సులకు డిగ్రీలో 55 శాతం మార్కులు; ఇంటిగ్రేటెడ్ కోర్సులకు 10+2/ ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలి.
సెలెక్షన్: ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ రూల్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. సంబంధిత సబ్జెక్టులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.