తెలంగాణలో పీజీ కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025కు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఆగస్ట్ 4 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కాగా సీపీగెట్ కోసం అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం:
1.అభ్యర్థులు ముందుగా సీపీగెట్ అధికారిక వెబ్‌సైట్ cpget.tsche.ac.in లోకి లాగిన్ అవ్వాలి.
2.హోమ్ పేజీలో కనిపించే “Download Hall Ticket” లింక్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీలను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత “Download Hall Ticket” బటన్‌ను క్లిక్ చేస్తే హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి.
పరీక్ష తేదీలు, సమయం :
ఆగస్ట్ 4 నుంచి 11 వ తేదీ వరకు సీపీగెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. మూడు సెషన్లలో ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్, 1 నుంచి 2.30 వరకు రెండవ సెషన్, సాయంత్రం 4 నుంచి 6.30 వరకు మూడవ సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
సూచనలు:
పరీక్షా కేంద్రానికి వెళ్ళేటప్పుడు అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ) తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్, ఐడీ కార్డు లేకపోతే పరీక్షహాల్‌లోకి అనుమతించరు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవడం మంచిది.





