Homeవార్తలుపీజీ కోర్సుల ఎంట్రన్స్​ సీపీ గెట్​ (CPGET 2022) రెడీ.. జులై 4 లాస్ట్ డేట్​

పీజీ కోర్సుల ఎంట్రన్స్​ సీపీ గెట్​ (CPGET 2022) రెడీ.. జులై 4 లాస్ట్ డేట్​

రాష్ట్రంలోని ఎనిమిది యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే కామన్ పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ (CPGET 2022) నోటిఫికేషన్ రిలీజైంది. జూన్​ 6 నుంచి ఆన్​లైన్​లో రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జులై 4 వరకు విద్యార్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. రూ.500 ఫైన్​తో జులై 11 వరకూ, రూ.2 వేల ఫైన్​తో జులై 15 వరకూ ఉన్నత విద్యామండలి తుది గడువును నిర్ణయించింది.

Advertisement

ఈ నోటిఫికేషన్​ ద్వారా రాష్ట్రంలోని ఉస్మానియా వర్సిటీ, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు,శాతవాహన, జేఎన్​టీయూతో పాటు కొత్తగా తెలంగాణ మహిళా యూనివర్సిటీలోనూ అడ్మిషన్లు చేపడుతారు. ఎనిమిది యూనివర్సిటీల పరిధిలో ఉన్న 320 పీజీ కాలేజీల్లో 44,604 సీట్లున్నాయి. వీటన్నింటినీ సీపీగెట్ లో వచ్చే మార్కుల మెరిట్​, రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ చేస్తారు.

జులై 20 నుంచి సబ్జెక్టుల వారిగా ఎంట్రెన్స్​ ఎగ్జామ్​ నిర్వహిస్తారు. డిగ్రీలో ఏ సబ్జెక్టు చదివిన వారైనా సోషల్ సైన్స్, లాంగ్వేజీ కోర్సుల్లో పీజీ చేసేందుకు అర్హులుగా పరిగణిస్తారు. గత ఏడాది ఎంకాం, ఎంఎస్సీ కెమిస్ర్టీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, జువాలజీ,బాటనీ,ఇంగ్లిష్, తెలుగు తదితర కోర్సుల్లో వెయ్యికిపైగా సీట్లు నిండాయి. మిగిలిన కోర్సుల్లో తక్కువగా అడ్మిషన్లు జరిగాయి.

Advertisement

RECENT POSTS

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!