ఈనెల 21న జరగాల్సిన కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా పడింది. వారం రోజులు ఆలస్యంగా 28వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) ప్రకటన విడుదల చేసింది. ఈనెల 18 వ తేదీ నుంచి అఫిషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచనుంది. 15644 సివిల్, ఏఆర్, 614 ఎక్సైజ్, 63 ట్రాన్స్ పోర్ట్ కానిస్టేబుల్ పోస్టులకు TSLPRB ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, పరిపాలనా కారణాలతోనే పరీక్ష వాయిదా వేసినట్లు బోర్డు ప్రకటించింది.