సశాస్త్ర సీమ బాల్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, కానిస్టేబుల్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 272 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ స్పోర్ట్స్ కోటా కింద జరిగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 21 అక్టోబర్ 2023 నుండి ప్రారంభమైంది. అప్లికేషన్ ప్రారంభమైన వెంటనే, అభ్యర్థులు సశాస్త్ర సీమా బల్ (SSB) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 20 నవంబర్ 2023గా నిర్ణయించారు.
అర్హత:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదోతరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నిర్దేశించిన క్రీడా ఈవెంట్లలో పాల్గొని ఉండాలి. వయసు 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
క్రీడా విజయాలు, రాత పరీక్ష, ఫీల్డ్ ట్రయల్, స్కిల్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు దేశంలో లేదా భారత భూభాగం వెలుపల సేవలు అందించాల్సి ఉంటుంది.
దరఖాస్తులు:
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ www.ssb.com చెక్ చేసుకోండి.