రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు ఈ ఏడాది నుంచి కామన్ అకడమిక్ క్యాలెండర్ను అమలు చేస్తాయి. 2021–22 కు సంబంధించి అడ్మిషన్లు మొదలు సెమిస్టర్ల వారీగా క్లాసుల ప్రారంభం, సెలవులు, ప్రాక్టికల్స్, పరీక్షలకు సంబంధించిన తేదీలను ఈ క్యాలెండర్లో పొందుపరిచారు. అన్ని వర్సిటీల వీసీలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ క్యాలెండర్ను ఖరారు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్లకు DOST దోస్త్ నోటిఫికేషన్ వెలువడింది. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
పూర్తి వివరాలున్న క్యాలెండర్ ఇదిగో..!
