ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రేపటితో ఈ పోస్టులకు అప్లికేషన్ గడువు ముగియనుంది. మొదట ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 660 ఖాళీల భర్తీ కోసం విడుదలైన ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునేందుకు జూన్ 11వ తేదీ చివరి తేదీ కాగా.. దీనిని 21కి పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే..ఎలాంటి గేట్ (GATE) స్కోర్ లేకుండా, కేవలం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పీజీ చేసిన అభ్యర్థులకు ఇదొక సువర్ణావకాశం. ఇంకా అప్లై చేయని వారు వెంటనే అధికారిక వెబ్‌సైట్ coalindia.in లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు & విభాగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 విభాగాలలో 660 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
సివిల్: 178 పోస్టులు
ఎలక్ట్రికల్: 221 పోస్టులు
మెకానికల్: 145 పోస్టులు
సిస్టమ్ (IT/CS): 43 పోస్టులు
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్: 38పోస్టులు
జియాలజీ: 15 పోస్టులు
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్: 11 పోస్టులు
రాజభాష (హిందీ): 05 పోస్టులు
కంపెనీ సెక్రటరీ: 04 పోస్టులు
విద్యార్హత: సంబంధిత విభాగాల్లో 60% మార్కులతో BE/B.Tech/M.Sc/MCA/MA ఉత్తీర్ణులై ఉండాలి (SC/ST/PwBD అభ్యర్థులకు 55% మార్కులు ఉండాలి). ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయస్సు:అభ్యర్థుల వయస్సు 30 ఏప్రిల్ 2026 నాటికి 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
జీతం:
ఎంపికైన అభ్యర్థులకు E-1 గ్రేడ్ కింద ట్రైనింగ్ పీరియడ్‌లో నెలకు రూ. 60 వేల జీతం లభిస్తుంది. ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక పే-స్కేల్ రూ.60,000-రూ. 1,80,000 గా ఉంటుంది. దీంతో పాటు DA, HRA, ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలకు ఎలాంటి ఇంటర్వ్యూ లేదు. ఈ పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. కేవలం కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పేపర్-1: జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్ (100 మార్కులు).
పేపర్-2: ప్రొఫెషనల్ నాలెడ్జ్ (సబ్జెక్ట్ రిలేటెడ్ – 100 మార్కులు).
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు..రూ. 1,180(GSTతో కలిపి)ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూడీ/ కోల్ ఇండియా ఉద్యోగులకు..ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ coalindia.in ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.





