కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) 2026 సంవత్సరానికి గాను మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 660 ఖాళీలతో విడుదలైన ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఐటీ వంటి 9 విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు మే 12 నుంచి జూన్ 11 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఇంజనీరింగ్, పీజీ అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.
కోల్ ఇండియా మేనేజ్‌మెంట్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2026:
ముఖ్యమైన వివరాలు:
మొత్తం ఖాళీలు: 660 (సివిల్-178, ఎలక్ట్రికల్-221, మెకానికల్-145, సిస్టమ్స్-43, మిగిలినవి ఇతర విభాగాలు).
వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు ఏప్రిల్ 30, 2026 నాటికి గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. రిజర్వ్‌డ్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హత: సంబంధిత విభాగంలో ఫుల్-టైమ్ బీఈ/బీటెక్/బీఎస్సీ/ఎంటెక్ లేదా ఎంసీఏలో కనీసం 60% మార్కులు (SC/ST/PwD వారికి 55%) ఉండాలి. 2025-26 విద్యాసంవత్సరంలో చివరి ఏడాది చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు. కేవలం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారానే ఎంపిక చేస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి.
పేపర్-1: జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్
పేపర్-2: సంబంధిత సబ్జెక్టుపై ప్రశ్నలు ఉంటాయి.
నెగటివ్ మార్కింగ్ విధానం లేదు.
జీతం :
ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో.. నెలకు రూ.60 వేల జీతంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి. శిక్షణ పూర్తయ్యాక రూ.60,000-1,80,000 పే స్కేల్ వర్తిస్తుంది. అభ్యర్థులు 60 నెలల పాటు పని చేస్తామని రూ. 3 లక్షల బాండ్ సమర్పించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,180 కాగా, ఇతరులకు ఎలాంటి ఫీజు లేదు.
అప్లికేషన్ విధానం:
అర్హులైన అభ్యర్థులు కోల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.coalindia.in లో ‘Career with CIL’ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.





