- తెలంగాణ శీతోష్ణస్థతిని ‘ఆయనరేఖ రుతుపవన శీతోష్ణస్థితి’గా చెప్పవచ్చు. ఇక్కడి వాతావరణం వేడిగాను, పొడిగానూ ఉంటుంది. ఇది ఉష్ణమండల స్టెప్పీ శీతోష్ణస్థితిని పోలి ఉంటుంది.
- రాష్ట్ర అత్యధిక సగటు ఉష్ణోగ్రత 31.5 డిగ్రీలు కాగా అతి తక్కువ సగటు ఉష్ణోగ్రత 8 డిగ్రీలుగా నమోదైంది.
- తెలంగాణలో ఉత్తర, వాయువ్య ప్రాంతాలలో వర్షపాత విచలనం(rainfall deviation) తక్కువగా ఉంటుంది. దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మహబూబ్‍నగర్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో వర్షపాత విచలనం ఎక్కువగా ఉంటుంది.
- రాష్ట్రంలో నైరుతి రుతుపవన కాలంలో వర్షపాత విచలనం 25శాతం వరకు, ఈశాన్య రుతుపవన కాలంలో 80శాతం వరకు ఉంటుంది.
- రాష్ట్రంలో వర్షపాత విచలనం అధికంగా గల జిల్లా – జోగులాంబ గద్వాల, తక్కువగా గల జిల్లా – అదిలాబాద్
- నైరుతి రుతుపవన కాలం
- రాష్ట్రంలో 80శాతం వర్షపాతం నైరుతి రుతుపవనాల వల్ల సంభవిస్తుంది. జూన్ రెండోవారంలో రాష్ట్ర భూభాగంలోకి ప్రవేశించడంతో వర్షాలు పడటం ప్రారంభమవుతుంది.
- నైరుతి రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే జిల్లాలు – ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి
- అతి తక్కువగా వర్షపాతం సంభవించే జిల్లాలు – నల్లగొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల
- నైరుతి రుతుపవన కాలంలో సంభవించే సగటు వర్షపాతం – 715 మిల్లీమీటర్లు
- ఈశాన్య రుతుపవన కాలం
- ఈ రుతువులో బంగాళాఖాతంలో ఏర్పడే చక్రవాతాల వల్ల రాష్ట్రంలో వర్షం సంభవిస్తుంది.
- ఈశాన్య రుతుపవనాల వల్ల తెలంగాణలో సంభవించే సగటు వర్షపాతం – 129 మిల్లీమీటర్లు
- ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే జిల్లాలు – నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు
- అతి తక్కువ వర్షపాతం పొందే జిల్లాలు – ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్
- ఈశాన్య రుతుపవనాలనే తిరోగమన రుతుపవన కాలం అంటారు.
- ఇండియా సగటు వర్షపాతం – 118 సెంటీమీటర్లు, తెలంగాణ సగటు వర్షపాతం – 906 మిల్లీమీటర్లు
- దేశంలో అత్యధిక వార్షిక సగటు వర్షపాతం పొందే ప్రాంతాలు – పశ్చిమ కనుమలు, ఈశాన్య ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవులు
- తెలంగాణలో అత్యధిక సగటు వర్షపాతం పొందే జిల్లాలు – ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్
- తక్కువ సగటు వర్షపాతం పొందే జిల్లాలు – జోగులాంబ గద్వాల
- తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం – కొత్తగూడెం
- అత్యధిక సగటు ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు – రామగుండం, భద్రాచలం, దుమ్ము గూడెం
- రాష్ట్రంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా – ఆదిలాబాద్
- రాష్ట్రంలో సంభవించే మొత్తం వర్షపాతంలో దాదాపు 80శాతం నైరుతి రుతుపవనకాలంలో కురుస్తుంది.
- 34 డిగ్రీల సమ ఉష్ణరేఖ తెలంగాణను రెండుగా విభజిస్తుంది. ఈ రేఖ ఖమ్మం జిల్లాలో దక్షిణంగా వెళ్తూ హన్మకొండకు దగ్గరగా, కరీంనగర్‍కు దక్షిణంగా నిజామాబాద్ పక్కన వెళ్తుంది.
- రాష్ట్ర సాధారణ వర్షపాతం దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వెళ్లే కొలది పెరుగుతుంది.
- నైరుతి రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం సంభవించే ప్రాంతం – ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్
- నైరుతి రుతుపవనాల వల్ల తక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం – నల్లగొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల
- 2017–18 సర్వే ప్రకారం ఈశాన్య రుతుపవనాల వల్ల అధికంగా వర్షపాతం నమోదైన జిల్లా – హైదరాబాద్, అతి తక్కువ వర్షపాతం కురిసిన జిల్లా – కరీంనగర్
- తెలంగాణ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం – భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీలేరు నది బేసిన్ ప్రాంతం.
- వాతావరణ మండలాలు
- నేలలు, వర్షపాతం, పంటల విధానం ఆధారంగా రాష్ట్రాన్ని 4 వ్యవసాయ మండలాలుగా విభజించారు.
- ఉత్తర తెలంగాణ మండలం
- దీని ప్రధాన కేంద్రం – జగిత్యాల
- పరిధిలోని జిల్లాలు.. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల
- దీని పరిధిలో 6 పరిశోధన కేంద్రాలున్నాయి.
- మధ్య తెలంగాణ మండలం
- ప్రధాన కేంద్రం – వరంగల్
- జిల్లాలు.. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
- దీని పరిధిలో 7 పరిశోధన కేంద్రాలున్నాయి.
- దక్షిణ తెలంగాణ మండలం
- ప్రధాన కేంద్రం – పాలెం
- జిల్లాలు.. మహబూబ్‍నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి
- దీని పరిధిలో 6 పరిశోధన కేంద్రాలున్నాయి.
- అధిక ఎత్తులో గల గిరిజన ప్రాంతాల మండలం
- ప్రధాన కేంద్రం – చింతపల్లి
- జిల్లాలు.. ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న ఎత్తైన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు
- దీని పరిధిలో 3 పరిశోధన కేంద్రాలున్నాయి.
- విస్తీర్ణపరంగా అతిపెద్ద వ్యవసాయ వాతావరణ మండలం – దక్షిణ తెలంగాణ మండలం
- అతి చిన్న వాతావరణ మండలం – అధిక ఎత్తు, గిరిజన ప్రాంతాల మండలం
- పరిశోధన సంస్థల పరంగా పెద్ద వ్యవసాయ వాతావరణ మండలం – మధ్య తెలంగాణ మండలం
error: Content is protected !!