HomeADMISSIONSక్లాట్ 2026.. లా డిగ్రీ పీజీ కోర్సులకు అప్లికేషన్లు ​

క్లాట్ 2026.. లా డిగ్రీ పీజీ కోర్సులకు అప్లికేషన్లు ​

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా డిగ్రీ, పీజీ కోర్సులకు నిర్వహించే కామన్​ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2026) నోటిఫికేషన్​ వెలువడింది. వచ్చే ఏడాది 24 యూనివర్సిటీల్లో అండర్​ గ్రాడ్యుయేట్​ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్​ (PG) లా కోర్సుల్లో అడ్మిషన్లకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్‌ 7వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు క్లాట్​ పరీక్ష నిర్వహిస్తారు. క్లాట్​లో మెరిట్​ ర్యాంకుల ఆధారంగా అయిదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం (యూజీ, పీజీ, డిగ్రీ) ప్రోగ్రాముల్లో సీట్లు కేటాయిస్తారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్​ 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కోర్సులు
1. అండర్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
2. పోస్ట్-గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఏడాది ఎల్‌ఎల్‌ఎం డిగ్రీ)

  • ముఖ్య తేదీలు
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 2025 ఆగస్ట్ 1
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 2025 అక్టోబర్ 31
  • క్లాట్‌-2026 పరీక్ష (ఆఫ్‌లైన్‌) తేది: 2025 డిసెంబర్​ 7
  • దరఖాస్తు ఫీజు: రూ.4,000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, బీపీఎల్‌ అభ్యర్థులకు రూ.3,500

యూజీ కోర్సులకు కనీసం 45 శాతం మార్కులతో 10+2 లేదా తత్సమాన పరీక్ష. పీజీ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు అఫిషియల్​ వెబ్​సైట్ consortiumofnlus.ac.in/clat-2026/

విశ్వవిద్యాలయాలు:
ఎన్‌ఎస్‌ఐయూ(బెంగళూరు),
నల్సార్‌(హైదరాబాద్),
ఎన్‌ఎల్‌ఐయూ(భోపాల్),
డబ్ల్యూబీఎన్‌యూజేఎస్‌(కోల్‌కతా),
ఎన్‌ఎల్‌యూ(జోధ్‌పూర్),
హెచ్‌ఎన్‌ఎల్‌యూ(రాయ్‌పూర్),
జీఎన్‌ఎల్‌యూ(గాంధీనగర్),
ఆర్‌ఎంఎల్‌ ఎన్‌ఎల్‌యూ (లఖ్‌నవూ),
ఆర్‌జీఎన్‌యూఎల్‌(పంజాబ్),
సీఎన్‌ఎల్‌యూ(పట్నా),
ఎన్‌యూఏఎల్‌ఎస్‌(కొచ్చి),
ఎన్‌ఎల్‌యూవో(ఒడిశా),
ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్‌(రాంచీ),
ఎన్‌ఎల్‌యూజేఏ(అసోం),
డీఎస్‌ ఎన్‌ఎల్‌యూ(విశాఖపట్నం),
టీఎన్‌ ఎన్‌ఎల్‌యూ(తిరుచిరాపల్లి),
ఎంఎన్‌ఎల్‌యూ(ముంబయి),
ఎంఎన్‌ఎల్‌యూ(నాగ్‌పుర్),
ఎంఎన్‌ఎల్‌యూ(ఔరంగాబాద్‌),
హెచ్‌పీఎన్‌ఎల్‌యూ(షిమ్లా),
డీఎన్‌ఎల్‌యూ(జబల్‌పూర్‌),
డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ(హరియాణా),
ఎన్‌ఎల్‌యూటీ (అగర్తలా),
జీఎన్‌ఎల్‌యూ(సిల్వస్సా),
ఆర్‌పీఎన్‌ఎల్‌యూపీ(ప్రయాగ్‌రాజ్),
ఐఐయూఎల్‌ఈఆర్‌ (గోవా)

.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here