హైదరాబాద్ లోని నల్సార్ సహా దేశం లోని 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (CLAT 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 8వ తేదీ నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు నవంబర్ 13 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. క్లాట్ ఎగ్జామ్ డిసెబర్ 18 వ తేదీన జరగనుంది. పూర్తి వివరాలు వెబ్ సైట్ లో అందుబాటు లో ఉన్నాయి.
దరఖాస్తులు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు: ఇతరులకు రూ.4000, ఎస్సీ/ ఎస్టీ/ బీపీఎల్ విద్యార్థులకు రూ.3500
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 8.8.2022
చివరి తేది: 13.11.2022.
క్లాట్ ఎగ్జామ్: 18 డిసెంబర్ 2022
వెబ్సైట్: www.consortiumofnlus.ac.in
1) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ)
అర్హత: జనరల్ అభ్యర్థులు కనీసం 45% మార్కులతో ఇంటర్మీడియట్(10+2)/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40 శాతం మార్కులు రావాలి, మార్చి/ ఏప్రిల్ 2023లో ఇంటర్ పూర్తి చేసే విద్యార్థులు కూడా అర్హులే. గరిష్ఠ వయోపరిమితి లేదు.