ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఉద్యోగుల ఎంపిక కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ వెల్లడించింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిని ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలకు దేశవ్యాప్తంగా 1,823 మంది ఎంపికయ్యారు. ఏప్రిల్ 5 తేదీ నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు యూపీఎస్‌సీ తెలిపింది. సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ ఈ ఏడాది జనవరి 7 నుంచి 16 వరకు నిర్వహించారు.
పూర్తి వివరాలు యూపీఎస్సీ వెబ్ సైట్ లో చూడవచ్చు. https://www.upsc.gov.in/
రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS